Sunday, September 21, 2025

విద్యాహక్కు చట్టాన్ని సవరించాలి: కిషన్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 23(2)ను సవరించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని ఉపాధ్యాయ ఎంఎల్‌సి పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపునిస్తూ చట్టాన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తమ ప్రాతినిధ్యాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారని శ్రీపాల్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలికంగా ఉన్న ఏకీకృత సర్వీస్ నిబంధనల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనలు పంపిస్తే కేంద్ర హోంశాఖ నుండి ఉత్తర్వులు ఇప్పిస్తానని చెప్పారని అన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుండి అదనపు నిధులు మంజూరు చేయుటకు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి ప్రాతినిధ్యం చేస్తానని తెలిపారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఎంఎల్‌సి శ్రీపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో పిఆర్‌టియుటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పుల్గం దామోదర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్ రెడ్డి, నాయకులు నవీన్ రెడ్డి, గిరిధర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News