Tuesday, May 14, 2024

రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ సమీక్ష

- Advertisement -
- Advertisement -

Minister KTR conducted a review on revenue issues

హైదరాబాద్: జిహెచ్ఎంసి పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి కెటిఆర్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్ గత ఆరేళ్లల్లో దేశంలోని లక్షలాది మందికి గమ్యస్థానంగా మారిందన్నారు. పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వమే అభివృద్ధికి కారణమని మంత్రి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో ఎవరీకి ఇబ్బంది లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. సాగు భూములపై హక్కులు కల్పించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామని వివరించారు. సామాన్యుడిపై భారం పడకుండా కొత్తం చట్టం తీసుకువస్తున్నామన్నారు.

భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆదారంగానే జరుగుతాయని తెలిపారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాసుపుస్తకాలు ఇస్తామని మంత్రి చెప్పారు. హైదరాబాద్ లో సుమారు 24.50లక్షల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశాం. ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులను పొందేలా ప్రయంత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఆస్తుల క్రమవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామని వెల్లడించారు. ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆస్తుల నమోదు కార్యక్రమంలో దళారులను నమ్మొద్దు, ఒక్కపైసా ఇవ్వవద్దని మంత్రి కెటిఆర్ ప్రజలకు సూచించారు.

Minister KTR conducted a review on revenue issues

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News