Tuesday, April 30, 2024

ప్రధానికి మంత్రి కెటిఆర్ సవాల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి సర్కారుపై మంత్రి కెటిఆర్ తీవ్ర విమర్శలు గుప్పిం చారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబర్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే చెప్పాలని ప్రధాని మోడీకి కెటిఆర్ సవాల్ విసిరారు. కేవలం రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని విమర్శించారు. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనపై ఆదివారం ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ స్పందించారు. భారతదేశంలో అత్యధికంగా 7.7 శాతం గ్రీన్ కవర్ వృద్ధిని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. అలాగే, దేశంలో మునిసిపాలిటీల అభివృద్దిలో అత్యధిక అవార్డులను (26) గెలుచు కుందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించిన మరుసటి రోజే ఆయనపై సవాల్ విసిరారు.

తెలంగాణ సాధించిన విజయాలను వివరించిన కెటిఆర్ ఇంత జరుగుతున్నా ప్రధానికి ఒక్క ప్రశంసా పదం కూడా ఉపయోగించలేదని పేర్కొన్నారు. చిల్లర రాజకీయాల కోసమే మెరుగైన పనితీరు కనబరిచే రాష్ట్రాన్ని గుర్తించడానికి ప్రధాని నిరాకరించారని ఆరోపించారు. భారతదేశంలోనే అత్యధిక తలసరి వృద్ధిని సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించిన తొలి రాష్ట్రమని తెలిపారు. తెలంగాణ ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసిందనీ, 100శాతం బహిరంగ మలవిసర్జన రహిత (ఒడిఎఫ్) ప్లస్ గ్రామాలతో భారత దేశంలోనే అత్యుత్తమ గ్రామీణాభివృద్ధి నమూనాను కలిగి ఉందన్నారు. భారతదేశంలో అత్యధిక ఐటి ఉద్యోగాలను కల్పిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. భారత జిడిపికి దోహదపడే టాప్ 4 రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉందన్నారు. దీంతో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో టాప్ 3లో ఉన్న రాష్ట్రమని తెలిపారు.

భారతదేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం తెలంగాణలో ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద టెక్స్ టైల్ పార్కు – కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ (కెఎంటిపి) కు నిలయం తెలంగాణ అని చెప్పారు. ప్రపంచంలోనే వ్యాక్సిన్ హబ్ గా ఉన్న ఈ రాష్ట్రం భారత్‌లో అత్యధిక తలసరి విద్యుత్ వినియోగాన్ని కలిగి ఉందన్నారు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిదారుగానూ ఉంది. భారతదేశంలో అతి తక్కువ జిఎస్‌డిపి నిష్పత్తి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. 2015-20 సంవత్సరానికి గాను మెర్సర్ సంస్థ వరుసగా 5 సంవత్సరాలు బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ కు రేటింగ్ ఇచ్చిందన్నారు. సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సిఎస్‌డిఎఫ్) తాజా సర్వే ప్రకారం భారతదేశంలోనే తెలంగాణలో అతి తక్కువ అవినీతి ఉందనీ, రాష్ట్రానికి అనేక అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయని తెలిపారు. రాజకీయాల కోసం అత్యుత్తమ పర్ఫార్మింగ్ రాష్ట్రంగా తెలంగాణను ప్రధాని అంగీకరించలేకపోతున్నారని మంత్రి కెటిఆర్ విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News