Sunday, April 28, 2024

పేదల ఆనందంలోనే ‘తృప్తి’

- Advertisement -
- Advertisement -

Minister KTR launch 2 BHK Dignity Housing Colony in Old Marredpally

ప్రజలకు ఇల్లు కట్టించి పెళ్లి చేస్తానని ముందుకొచ్చిన కెసిఆర్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరు

గత పాలకులు ఇరుకు ఇళ్లను ఇస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ ప్రతీకలుగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇస్తున్నది
లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే కడుపు నిండినట్లయింది
సికింద్రాబాద్ ఓల్డ్ మారేడ్‌పల్లిలో అత్యంత విలువైన 5ఎకరాల 18గుంటల హౌజింగ్ బోర్డు స్థలంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/ మారేడుపల్లి : నిజమైన రాజకీయ నాయకుడికి పేదల ఆనందంతోనే ఎక్కడా లేని తృప్తిని ఇస్తుందని దాని కోసమే సిఎం కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇస్తున్నట్లు రాష్ట్ర, ఐటి పురపాలక శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం కంటోన్మెంట్ నియోజకర్గ పరిధిలోని వెస్ట్ మారేడుపల్లిలో 468 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మూద్ అలీ, మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్నతో కలిసి కెటిఆర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ పేదలకు ఇళ్ళు కట్టించి, పెళ్లి చేస్తానని ముందుకు వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి దేశంలోనే ఇంకా ఎక్కడా లేరన్నారు. ఇతర రాష్ట్ర ప్రజలు ఇలాంటి ముఖ్యమంత్రి మాకు లేరని బాధపడుతున్నారని తెలిపారు. కెసిఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టించడంతో పాటు ప్రతి పేదింటి ఆడబిడ్లకు పెళ్ళిండ్ల్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారని వివరించారు. గత పాలకులు చిన్న ఇండ్లను నిర్మిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవవానికి ప్రతీకగా డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మించి ఒక్క రూపాయ ఖర్చులేకుండా ప్రజలకు ఇస్తుందన్నారు.

ఈ రెండు పడక గదుల ఇండ్లు బ్రహ్మండగా ఉన్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే కడుపు నిండినంతా పనైందన్నారు. ఇంతకు మించిన తృప్తి రాజకీయ రంగంలో దేనితో రాదన్నారు. రాజధాని నడిబొడ్డున ఉన్న మారేడుపల్లిలో అత్యంత విలువైన 5 ఎకరాల 18 గుంటల హౌసింగ్ బోర్డు స్థలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించామని తెలిపారు. రూ. 350 కోట్ల విలువ చేసే ఈ స్థలానికి హౌసింగ్ బోర్డు నుంచి జిహెచ్‌ఎంసికి బదిలీ చేసి అప్పగించినట్లు కెటిఆర్ పేర్కొన్నారు. విలువైన స్థలంలోనే ఇక్కడున్న నిరుపేద డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారని చెప్పారు. ఈ స్థలంలో ఇండ్లు గజం భూమి లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఖరీదని, ఈ రకంగా ప్రజలను కోటీశ్వర్లను సిఎం చేశారని కొనియాడారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ ప్రజలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అమ్మే ప్రసక్తే లేదని అన్నారు. ఈ ఆస్తిని కాపాడుకోవల్సిన బాధ్యత లబ్ధిదారులదేనని తెలియజేశారు.

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ లబ్ధిదారులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయిస్తామని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ నెల 14 తేదీ బస్తీలలో సమావేశం పెట్టి మిగితా లబ్ధిదారులకు ఇండ్లను కేటాయిస్తామని తెలిపారు. ఇంత చక్కటి ఇండ్లను కట్టించిన సిఎం కెసిఆర్‌కు రుణపడి ఉండాలని సూచించారు. హౌసింగ్ బోర్డుకు చెందిన ఈ స్థలంలో అనేక మంది నిరుపేదలు సరైన సౌకర్యాలు లేక, ఇరుకైన ఇండ్లలలో జీవనం సాగించేవారని పేర్కొన్నారు. తాను సిఎం దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే పెద్దమనస్సుతో స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభీ వాణిదేవి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, టిఎస్‌ఎంఎస్‌ఐడి చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, బేవ రేజేస్ గజ్జెల నగేష్ పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News