Friday, May 3, 2024

చర్చలు సఫలం

- Advertisement -
- Advertisement -

శాంతించిన విఆర్‌ఎలు
ఫలించిన మంత్రి
కెటిఆర్ చొరవ

జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల
నేపథ్యంలో ఆందోళన
విరమించాలని మంత్రి సూచన
సమ్మతించిన ప్రతినిధులు,
సమ్మె తాత్కాలికంగా వాయిదా
20న సిఎస్‌తో చర్చలు

మనతెలంగాణ/హైదరాబాద్: విఆర్‌ఎల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంగళవా రం ఆందోళన చేపట్టిన విఆర్‌ఎల ప్రతినిధులతో అసెంబ్లీ కమిటీ హాల్ లో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. విఆర్‌ఎల సమస్యలపై చర్చకు సిద్ధమైన సర్కార్ 15 మందితో కూడి న విఆర్‌ఎల ప్రతినిధి బృందాన్ని అ సెంబ్లీకి ఆహ్వానించింది. విఆర్‌ఎల సమస్యలు, డిమాండ్లపై మంత్రి కెటిఆర్ వారితో చర్చించారు. పే స్కేల్, పదోన్నతులు ఇవ్వాలని, వయసు పై బడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని కెటిఆర్‌ను విఆర్‌ఎ ప్రతినిధులు కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో జాతీయ సమైక్యత వజ్రోత్సవ సంబరాలు జరుగుతున్నందున ఆందోళన విరమించి విధుల్లోకి రావాలని విఆర్‌ఎ ప్రతినిధులను మంత్రి కెటిఆర్ కోరారు. ఈ నెల 17న జాతీయ సమైక్యత వజ్రోత్సావలు ముగిసిన అనంతరం ఈ నెల 20న విఆర్‌ఎ సంఘం ప్రతినిధులతో సిఎస్ చర్చలు జరుపుతారని హామీ ఇచ్చారు. ప్రభుత్వం త రఫున మంత్రి కెటిఆర్ తమను పిలిచి చర్చించడం పట్ల విఆర్‌ఎ సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

తాత్కాలిక వాయిదా

మంత్రి కెటిఆర్ హామీతో తమ ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని విఆర్‌ఎల ప్రతినిధులు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. గతంలో సిఎం కెసిఆర్ తమకు ఇచ్చిన హామీల గురించి మంత్రికి వివరించామన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి, ఉన్నతాధికారులపై మాకు నమ్మకం ఉందని అన్నారు. నెల 20వ తేదీన జాయింట్ మీటింగ్ ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా.. ఉన్నతాధికారుల నిర్లక్షం వల్లే తమకు ఇచ్చిన హామీలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. తమ హామీలపై జీవో వచ్చాకే సమ్మె విరమించాలని అనుకున్నామని, కానీ మంత్రి కెటిఆర్ హామీ మేరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామని చెప్పారు. బుధవారం నుంచి 20వ తేదీ వరకు నిరసన శిబిరాల్లో తమ శాంతియుతంగా నిరసన కొనసాగిస్తామని అన్నారు. తమ హక్కుల కోసం 50 రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News