Saturday, April 27, 2024

టిఆర్‌ఎస్ మేనిఫెస్టోను బిజెపి కాపీ చేసింది: మంత్రి కెటిఆర్

- Advertisement -
- Advertisement -

Minister KTR Satires on BJP Manifesto

హైదరాబాద్: కాపీకొట్టేందుకు కూడా తెలివి ఉండాలని బిజెపిని రాష్ట్ర మంత్రి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకామారావు విమర్శించారు. బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోలో ్ల టిర్‌ఎస్ అమలు చేస్తున్న అభివృద్ధి పనులను, పనులకు సంబంధించిన ఫోటోలను మక్కికి మక్కి కాపీ చేసిందని గురువారం కెటిఆర్ ట్విట్టర్ వేదికగా బిజెపిని నిందించారు. హైదరాబాద్‌కు బిజెపి చేసింది ఏమీ లేకపోవడంతో టిఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని తన మేనిఫెస్టోలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలతో పాటుగా ఫోటోలుకూడా మావే అన్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం కోసం పక్కరాష్ట్రాల నుంచి నాయకులను అరువు తెచ్చుకున్న బిజెపి ఇప్పుడు టిఆర్‌ఎస్ మేనిఫెస్టోను కాపీ చేసిందన్నారు. బిజెపికి సొంత విధానాలు లేవు, నాయకులు లేరని ఆయన దుయ్యబట్టారు.

ఎన్నికల ప్రణాళికను కూడా సొంతంగా రాయలేని బిజెపి నాయకులు హైదరాబాద్‌ను పాలిస్తారాని ప్రశ్నించారు. ప్రజల చెవ్వుల్లో కమలం పువ్వు పెట్టడం బిజెపికి అలవాటైందన్నారు. బిజెపి మేనిఫెస్టోలోని డొల్లతనాన్ని, అసత్యాలను ప్రజలు గమనించాలని చెప్పారు. ఈమేనిఫెస్టోలో టిఆర్‌ఎస్ అమలు చేసిన పనులను కాపీ కొట్టి ఆచరణకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. టిఎస్ బిపాస్, కులవృత్తులకు ఉచిత కరెంట్, మహిళా పోలీసు స్టేషన్లు, నగరంలో టాయిలెట్స్, మెట్రో రైలు విస్తరణ, బ్రిడ్జిల నిర్మాణం, మూసి ప్రక్షాళన, భవన నిర్మాణ కార్మికులకు ఉచిత బీమా తదితర బిజెపి ప్రకటించిన అంశాలు టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఇవే అంశాలను తిరిగి బిజెపి తన ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చడం విచిత్రంగా ఉందన్నారు. నకల్ మార్‌నేకేలియే అకల్ రహన చాహీయే అంటూ కెటిఆర్ విమర్శించారు. మార్పుకోసం బిజెపి ప్రణాళిక అంటున్న బిజెపి ఏ మార్పు కోరుకుంటుందో చెప్పాలన్నారు. పచ్చని హైదరాబాద్‌లో చిచ్చుపెట్టే మార్పా? విశ్వ నగరాన్ని విద్వేష నగరంగా మార్చే మార్పా ఏ మార్పు బిజెపి కోరుకుంటుందని కెటిఆర్ ప్రశ్నించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News