Tuesday, April 30, 2024

జలమండలి ఉద్యోగులకు ఆరోగ్యభద్రత

- Advertisement -
- Advertisement -

Minister KTR who distributes healthcards to water board employees

5015 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు హెల్త్ కార్డులు
దేశవ్యాప్తంగా వెయ్యి ఆసుపత్రుల్లో వైద్యసేవలు
ప్రతిఏటా హెల్త్ ఇన్యూరెన్స్‌కు రూ. 6.78 కోట్లు చెల్లింపు
ప్రగతిభవన్‌లో హెల్త్‌కార్డులు పంపిణీ చేసిన మంత్రి కెటిఆర్

మన తెలంగాణ, హైదరాబాద్ : జలమండలి ఉద్యోగులకు తీపి కబురు అందించిన ప్రభుత్వం. గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న హెల్త్‌కార్డులకు మోక్షం లభించింది. ఉద్యోగుల సంఘాల నేతలు, ఎండీ దానకిషోర్ చొరవతో మున్సిఫల్ శాఖ మంత్రి కె.తారకరామరావు హెల్త్‌కార్డులను అందించారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఆరోగ్యభద్రత కోసం హెల్త్ ఇన్యూరెన్స్ కల్పించింది. సోమవారం ప్రగతిభవన్‌లో మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా వాటర్‌బోర్డు ఉద్యోగులు హెల్త్‌కార్డులను అందుకున్నారు.

మొత్తం 3,609 మంది ఉద్యోగులు, 894మంది పెన్షనర్లకు, ఫ్యామిలి పెన్షన్లు అందుకుంటున్న 548 మంది, సుమారు 10వేలు మంది వారి కుటుంబసభ్యులకు ఈఆరోగ్యభీమా వర్తించనుంది. దేశ వ్యాప్తంగా ఉన్న వెయ్యి ప్రముఖ ఆసుపత్రుల్లో ఇక నుంచి జలమండలి ఉద్యోగులు, పెన్షనర్లు,వారి కుటుంబ సభ్యులు రూ. 3లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఉద్యోగి, పెన్షనర్‌తో పాటు వారిపై ఆధారపడే ఐదుగురు కుటుంబ సభ్యులకు కూడా ఆరోగ్యభీమా వర్తిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి ప్రతి ఏటా రూ. 6.78 కోట్ల ప్రీమియం జలమండలి చెల్లిస్తుంది. హెల్త్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, మున్సిఫల్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్‌కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్ పాల్గొన్నారు.

ఆరోగ్యబీమా వివరాలు ః జలమండలిలో శాశ్వత ఉద్యోగులుగా పనిచేస్తున్న 3609 మందికి, 894 మంది పెన్షన్‌దారులకు, 548 ఫ్యామిలీ పెన్షన్‌దారులకు హెల్త్‌కార్డులు మంజూరు, ఉద్యోగితో పాటు వారిపై ఆధారపడే జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు(25ఏళ్లలోపు మగపిల్లలు, అవివాహితులైన ఆడపిల్లలు) ఇద్దరు తల్లిదండ్రులకు ఆరోగ్యబీమా వర్తిస్తుంది.
పెన్షన్‌దారులతో పాటు వారి జీవితభాగస్వామి, వారిపై ఆధారపడే ఇద్దరి ఆరోగ్యబీమా ఉంటుంది.
అప్పుడే జన్మంచిన ఉద్యోగుల పిల్లలకు కూడా బీమా వర్తిస్తుంది.

రూ. 50వేల వరకు ప్రసూతి సంబంధిత ఖర్చులు కూడా పొందవచ్చు. అన్యువల్ చెకప్‌కు కూడా హెల్త్ ఇన్సురెన్స్ వర్తింస్తుంది. అన్ని ఎమర్జెన్సీ వైద్య సేవలు, టెలీహెల్త్ సేవలకు కూడా బీమా సౌకర్యం ఉంటుంది. హెర్నియా, గర్భాశయ చికిత్స, దంత వైద్యం, పుట్టకతో వచ్చిన వ్యాధుల చికిత్స, కాలేయ సంబంధి వైద్యం, ఈఎన్‌టీ వైద్య సేవలు,చర్మ వ్యాధులకు సంబంధించిన వైద్యానికి కూడా బీమా వర్తిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News