Friday, May 3, 2024

కరోనాపై మరింత నిఘా

- Advertisement -
- Advertisement -

Minister Rajender

 

ఎయిర్‌పోర్టులో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు : మంత్రి ఈటల

విమానాశ్రయంలో నేటి నుంచి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు, ప్రతి ఒక్కరిని పరీక్షిస్తాం, అనుమానితులను గాంధీకి తరలిస్తాం
వైరస్ నియంత్రణ కోసం 24 గంటలు పని చేస్తాం, వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనాని కట్టడి చేసేందుకు నిఘా పటిష్ఠమైంది. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా, ఈరోజు నుంచి అత్యాధునిక టెక్నాలజీతో కూడిన పరికరాలతో థర్మల్ స్కీనింగ్ పరీక్షలను నిర్వహిస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో సోమవారం ఆయన స్కీనింగ్ పరీక్ష పరికరాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ..విమానాశ్రయంలో ప్రతి రోజూ సుమారు 550 నుంచి 600 మంది ఇతర దేశాల నుంచి వస్తుంటారని, కావున స్కీనింగ్ పరీక్షలు ఆలస్యం కాకుండా, నూతన పరికరాలతో థర్మల్ స్కీనింగ్ చేస్తామని మంత్రి వెల్లడించారు.

విమానాశ్రయంలో ఉన్న నాలుగు ప్రధాన దారుల్లో వైద్యులు, నర్సులు, ప్రత్యేక హెల్పర్లు ఉంటారని, విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని స్కానింగ్ చేస్తామని తెలిపారు. స్కానింగ్ చేసిన తర్వాత అనుమానం వస్తే ప్రత్యేకంగా విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన గదిలోకి తీసుకు వెళ్లి అతనికి పూర్తిగా మాస్కులు వేసి ప్రత్యేక వాహనంలో గాంధీకి తరలిస్తామని మంత్రి అన్నారు. గతంలో కేవలం 11, 12 దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను మాత్రమే స్కీనింగ్ చేసే వాళ్లమని, ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికి స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం చేసే స్కీనింగ్ పరికరాలతో కాస్త ఆలస్యమవుతుండటంతో ఈ రోజు నుంచి థర్మల్ స్కీనింగ్ పరీక్షలు చేసేందుకు అన్ని పరికరాలను సిద్దం చేశామన్నారు. ప్రతి రోజూ 24 గంటలు పనిచేసేందుకు సిబ్బందిని నియమించామని, ఒక్క ప్రయాణికుడు కూడా తప్పిపోకుండా అందరికి స్కానింగ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల తెలిపారు. తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని, కేవలం విదేశాల నుంచి వచ్చే వారిలో మాత్రమే అనుమానిత లక్షణాలు వస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డిఎంఇ రమేష్‌రెడ్డి, డిహెచ్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Minister Rajender who visited Shamshabad Airport
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News