Sunday, April 28, 2024

మున్సిపాలిటీల్లో ఇంకుడుగుంతలు…

- Advertisement -
- Advertisement -

Rainwater

 

మార్చి 6 నుంచి మే 31 వరకు స్పెషల్ డ్రైవ్
ప్రతి వార్డుకు ప్రత్యేక బృందం
139 పట్టణాల్లో 23,89,237 ఇళ్లు
కమిషనర్‌లను ఆదేశించిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ / హైదరాబాద్ : పట్టణాల్లో వర్షపునీటి ఇంకుడుగుంత(రేయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్)లను నిర్మించడంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని అన్ని మున్సిపల్ కమిషనర్‌లకు పురపాలక శాఖ ఆదేశించింది. ఈ నెల 6వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఈ స్పెషల్ డ్రైవ్ వివిధ కేటగిరీలుగా, విస్తృత ప్రచారం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రతి ఇంటికి వర్షపునీటి ఇంకుడు గుంత ఉండేలా చూడాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ఆదేశించిన నేపథ్యంలో పురపాలక శాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.

ప్రతి మున్సిపాటిలోని ఒక ప్రాంతాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయాలంటే అందుకు ప్రత్యేకంగా డీటేయిల్డ్ ప్లానింగ్ స్కీం లేదా స్థానిక ప్రదేశపు ప్లాన్ రూపొందించాలని, ఈ ప్లాన్ మాస్టర్‌ప్లాన్‌లో లేదా భూవినియోగ కేటగిరీని పరిగణలోకి తీసుకుని ఉండాలని కొత్త మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 171(2)లో వివరించింది. వ్యక్తిగత నివాసాల భవనాలు, మున్సిపల్ కార్యాలయ భవనాలు, వార్డు కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్, ప్రభుత్వం కార్యలయాలు, పాఠశాలలు, విద్యాసంస్థల భవనాలపైన కూడా ఇంకుడు గుంతలను నిర్మంచాలని కమిషనర్‌లకు పురపాలక శాఖ సూచించింది.

చేతిబోర్లు, బావులు, ఫిల్టర్‌బెడ్స్, సంపులు, ట్యాంక్‌ల ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. విద్యుత్ బోర్లు, మున్సిపల్‌కు చెందిన ఖాళీ ప్రాంతాలు, పార్కులు, క్రీడా మైదానాలు, వైకుంఠధామాలు, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు, ప్రార్థనామందిరాలు వంటి ప్రాంతాల్లోనూ వర్షపునీటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌లకు స్పష్టంచేసింది.

ప్రత్యేక డ్రైవ్ మే 31 వరకు…
ఈ నెల 6వ తేదీన మున్సిపల్ ఇంజనీర్లు లేదా టౌన్‌ప్లానింగ్ అధికారులు లేదా మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలిసి ప్రతి వార్డులో స్థానిక కౌన్సిలర్ లేదా కార్పోరేటర్‌తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకుడుగుంతల ఏర్పాటు ప్రదేశాలను గుర్తించాలి. ఈ నెల 11న నియామక బృందాలు స్థానికంగా ఇంకుడు గుంతలను నిర్మించేందుకు అనువుగా ఉన్న ప్రదేశాలను గుర్తించ డం, ఒక మున్సిపాలిటీల్లో ఎన్ని నిర్మించాలి, వాటికి అం చనా వ్యయం, నమూనాలను తయారు చేసేందుకు ఇం జనీర్‌లు, ప్లానింగ్ అధికారుల సహాకారాన్ని తీసుకోవా లి. ఈ నెల 6 నుంచి 14వ తేదీ వరకు అధికారుల నుంచి ప్రతిపాదనలు, వ్యయం, నమూనాల పూర్తిచేసి టెండర్ల ప్రక్రియను పూర్తిచేయాలి. ఈ నెల 11 నుంచి 14 వరకు స్వచ్చంద సంస్థలు, వార్డు బృందాలు, విద్యాసంస్థల ప్రతినిధులతో స్వయం సహాయక బృందాలతో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.

మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, ప్రజలతో కలిపి ప్రత్యేక సమావేశాలను మున్సిపల్ కమిషనర్‌లు నిర్వహించాలి. ఈ విషయాన్ని మీడియా ద్వరా విసృతంగా ప్రచారం చేయాలి. ఈ నెల 15 నుంచి మే నెల 31వ తేదీ వరకు ప్రతి మున్సిపాలిటీల్లో గుర్తించిన వాటిని నిర్మించాలి. ఈ కార్యక్రమాలను జిల్లాస్థాయి, మున్సిపాలిటీ స్థాయిలో పోటీలను ఏర్పాటుచేయాలని సిడిఎంఎ అధికారి వివరించారు. ప్రస్తుతం తెలంగాణాలోని 139 పట్ణాల్లో 23,89,237 ఇండ్లు ఉన్నాయి. వ్యక్తిగత ఇండ్లు 1,19,462. ప్రజాప్రతినిధుల ఇండ్లు 4,500. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల భవనాలు 30,358. చెరువులు, కుంటలు, నీటి వనరులు 426 గా, 11,500 బోరుబావులు, ఇతరములు 608 ఉన్నాయని అధికార రికార్డులు వెల్లడిస్తున్నాయి.

ఇంకుడు గుంతలతో ప్రయోజనాలు
పట్టణాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతున్న ప్రాంతాల్లో జలాలు పైకి తెప్పించేందుకు ఇంకుడుగుంతలే మార్గం. వర్షపు నీరు బ్యాక్టీరియాలాజికల్లి స్వచ్చమైనది. ప్రకృతిలో సహజసిద్దమైన ఆర్గానిక్ నీరు, ఆహార కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఇవి ప్రస్తుతమున్న నీటి వనరులను మరింతగా పురోగతిని తీసుకువస్తాయి. గ్రౌండ్ వాటర్ ద్వారా పురోగతిని తీసుకువస్తాయి.

Rainwater Harvesting Pit
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News