Monday, May 6, 2024

తెలంగాణ తొలి సాంస్కృతిక ప్రదర్శనను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

- Advertisement -
- Advertisement -

Minister Satyavathi visited first cultural exhibition in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు గిరిజనులు, జానపదులు, అట్టడుగు వర్గాలకు చెందిన వారి అపురూప కళలు, కళాకృతులు, కళాత్మక వ్యక్తీకరణలతో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన తెలంగాణ తొలి సాంస్కృతిక కృతులు, ఆకృతుల ఆద్యకళ ప్రదర్శనను శనివారం రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సందర్శించారు. అక్కడ ప్రదర్శించిన గిరిజన, ఆదివాసీ, జానపద, అట్టడుగు వర్గాలకు చెందిన కళలు, కళాకృతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రదర్శనలు చూసినప్పుడు మన గత వైభవం, దాని గొప్పతనం తెలుస్తుందన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్ తరాలకు మన చరిత్రను, సంస్కృతిని, సంప్రదాయాలను తెలియచేసే విధంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదర్శన నిర్వాహకులు తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్ రావు, కళాకృతుల సేకర్త జయధీర్ తిరుమలరావు, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ, ఇతర అధికారులను ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News