Saturday, April 27, 2024

కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయ్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చి ఏమైనా ప్రాజెక్టులు ఇస్తారనుకుంటే తిట్టి పోయారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో కేసీఆర్ పాలన ను మెచ్చుకున్నది ప్రధాని మోడీ యే కదా? కేసీఆర్ కుటుంబాన్ని తిట్టడం తప్ప మోడీ కి ఏమీ చేత కాదు అని తేలిపోయిందన్నారు. ఆదానీ కోసమే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ని పక్కన బెట్టారు. బీజేపీ గతంలో కుటుంబ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదా? అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకు పోతే కేంద్రం అవార్డులు ఎందుకు ఇస్తోందన్నారు. ఏ అంశం లో నైనా తెలంగాణతో ఇతర రాష్ట్రాలు పోటీ పడతాయా.. దేంట్లో నైనా బీజేపీ పాలిత రాష్ట్రాలు ముందున్నాయా అని సవాల్ విసిరారు.

మోడీ సీబీఐని గతంలో కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనలేదా?.. ఇపుడు ప్రతిపక్షాల తీరును తప్పుబట్టడం సమంజసమా అని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు లకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ రహదారులు తెలంగాణ హక్కు అన్నారు. సున్నం వేసి ఇల్లు నాదే అన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రాజెక్టులు చూసి నత్తలు కూడా సిగ్గు పడుతున్నాయన్నారు. ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ మీద మోడీ కక్ష మరోసారి బయట పడిందన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేసీఆర్ ది కుటుంబ పాలన కాదు.. తెలంగాణ అంతా కేసీఆర్ కుటుంబమే అన్నారు. మోడీ ది ఆదానీ కుటుంబమన్నారు. మోడీ నిధులు ఇవ్వకున్నా పర్వాలేదు.. మమ్మల్ని బద్నాం చేస్తే ఊరుకోమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News