Sunday, April 28, 2024

రఫేల్ ఒప్పందంపై ఎంబిడిఎకు రక్షణ శాఖ జరిమానా

- Advertisement -
- Advertisement -

Ministry of Defence fines MBDA over Rafale deal

న్యూఢిల్లీ: రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయనందుకు యూరోపియన్ క్షిపణి తయారీ సంస్థ ఎంబిడిఎకు 10 లక్షల యూరోలకు లోపు జరిమానాను రక్షణ మంత్రిత్వశాఖ విధించింది. రఫేల్ విమానాలను ఫ్రాన్సుకు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ కంపెనీ తయారు చేస్తుందగా విమానానికి చెందిన క్షిపణి వ్యవస్థను ఎంబిడిఎ సరఫరా చేస్తోంది. రూ. 59,000 కోట్ల వ్యయంతో 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడంపై 2016 సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌తో భారత్ అంతర్ ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది. ఎంబిడిఎ సరఫరా చేయాల్సిన క్షిపణి వ్యవస్థ కూడా ఈ ఒప్పంద నిబంధనల్లో భాగమే. 2019 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ మధ్య సరఫరాలో జాప్యానికి ఎంబిడిఎ నుంచి 10 లక్షల యూరోల లోపు జరిమానాను రక్షణ మంత్రిత్వశాఖ విధించి, వసూలు చేసినట్లు వర్గాలు తెలిపాయి. జరిమానా సొమ్మును డిపాజిట్ చేసిన ఎంబిడిఎ రక్షణ శాఖ వద్ద తన నిరసనను తెలియచేసినట్లు వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News