Friday, May 3, 2024

నూతన సభ్యత్వ నమోదుకు టీటా దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

 Invitation to TITA application for new membership registration

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలోని ముఖ్యనగరాలు, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో విస్తరించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తమతో కలిసి నడిచే వారి కోసం నూతన సభ్యత్వ ఆహ్వానం అందిస్తోంది. గ్లోబల్ కమిటీ సభ్యత్వం కోసం ఔత్సాహికులకు ఆహ్వానాన్ని ప్రకటించింది. టీటాకు చెందిన గ్లోబల్ కమిటీ – 2021 కాలపరిమితి ఈ డిసెంబర్ 31తో ముగియనున్న నేపథ్యంలో ఈ సభ్యత్వ కార్యక్రమం చేపడుతూ ఐటీ ఆధారిత వ్యక్తులు లేదా వ్యాపారసంస్థలు చేరవచ్చని వివరించింది. ఈ మేరకు టీటా గవర్నింగ్ కౌన్సిల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్ మెంబర్‌షిప్, ఎన్నారైలు, విద్యార్థులు, అసోసియేట్ సభ్యులు, ఐటీ ఫ్యాకల్టీ, ప్రభుత్వ రంగం నుంచి ఐటీ విభాగంలో ఉన్నవారు సభ్యులుగా చేరవచ్చని వివరించింది.

గ్లోబల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలు

టీటా గ్లోబల్ కమిటీ ప్రస్తుత బృందం కాలపరిమితి ముగుస్తున్న నేపథ్యంలో 2022 కాలపరిమితికి చెందిన నూతన కమిటీకి సభ్యత్వాలను ఆహ్వానిస్తూ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటన వెలువరించింది. గ్లోబల్ కమిటీ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీలు, జిల్లా కమిటీలకు సైతం ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొని ఔత్సాహికులకు సభ్యత్వం విషయంలో సహాయ, సహకారాలు అందించాలని సూచించింది. ఔత్సాహికులు bit.ly/joinTITA లింక్ ద్వారా సభ్యులుగా చేరవచ్చని, నామినేషన్లు పంపేవారు bit.ly/tita_nomination లింకులో ప్రతిపాదించవచ్చు. మరిన్ని వివరాలకు TelanganaIT@gmail.com ఈమెయిల్ లేదా 8123123434 ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News