Sunday, May 5, 2024

డిఫరెంట్ లేయర్డ్ స్టోరి

- Advertisement -
- Advertisement -

Missing movie to releasing on Nov 19

‘మిస్సింగ్’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు హర్షా నర్రా. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ నాయికలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీని జోస్యుల దర్శకుడు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హర్ష నర్రా మీడియాతో మాట్లాడుతూ “ఈ చిత్రంలో గౌతమ్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుంది ఈ చిత్రంలో. కొత్తగా పెళ్లైన గౌతమ్ భార్య శృతి కనిపించకుండా పోతుంది. ఆమె ఏమైంది? అనే నేపథ్యంలో కథ మొదలవుతుంది. డిఫరెంట్ లేయర్డ్ స్టోరి ఇది. దర్శకుడు శ్రీని చాలా స్పష్టతతో సినిమా చేశారు. హీరోయిన్లు నికీషా, మిషా అద్భుతంగా నటించారు. అజయ్ అరసాడ మంచి సంగీతాన్ని అందించారు” అని అన్నారు.

Missing movie to releasing on Nov 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News