Thursday, May 16, 2024

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట : గంత కొన్ని రోజులగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గాను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జిడిమెట్ల డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, మీనాక్షి ఎస్టేట్ లలో శుక్రవారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ అధికారులతో కలిసి పర్యటించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ రద నీరు నిలవకుండా చూడాలని, ఎస్‌ఎన్‌డిపి ద్వారా చే పడుతున్న నాలా పనులను త్వరతగిన పూర్తి చేసి ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని, రాబోయే రోజుల్లో ఈ కాలువ నిర్మాణం ద్వారా వరద ముంపుకు శాశ్వత ప రిష్కారం లభిస్తుంది అని తెలిపారు.

అదే విధంగా చుట్టుపక్కల కాలనీలలో ముంపుకు గురిఅవుతున్న వరదనీటి మళ్లించడానికి రూ.2.40 కోట్లతో త్వరలోనే కాలువ ని ర్మాణానికి కూడా చేపట్టబోతున్నాం అని ఎమ్మెల్యే కాలనీ వాసులకు తెలియచేసారు. అలాగే నియోజకవర్గంలో రా నున్న రోజులలో వరదనీటి ముంపుకు గురి కాకుండా ఒ కప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టి వర్షాకాలంలో ఎ లా ంటి సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ. చెన్నరెడ్డి, ఈ.ఈ. కృష్ణ చైతన్య, డిఈఈ పాపమ్మ, ఏఈలు సురేందర్ నా యక్, స్థానిక బిఆర్‌ఎస్ నాయకులు, కాలనీ సంక్షేమ సం ఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News