Saturday, April 27, 2024

మోడెర్నాకు గ్రీన్‌సిగ్నల్

- Advertisement -
- Advertisement -

Moderna vaccine likely to get DCGI's nod soon

న్యూఢిల్లీ : భారత్‌కు మరో విదేశీ కరోనా టీకా వస్తోంది. అమెరికాకు చెందిన మోడెర్నా టీకా దిగుమతుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లాకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) అనుమతి మంజూరు చేసింది. ఈ టీకా దిగుమతి, మార్కెటింగ్ అనుమతులు కోరుతూ సిప్లా సోమవారం డిసిజిఐకి దరఖాస్తు చేయగా, డిసిజిఐ పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసింది. టీకా పంపిణీ చేపట్టిన తరువాత తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి ఏడు రోజుల ఆరోగ్య పరిస్థితిని సంస్థ సమర్పించ వలసి ఉంటుందని అధికారిక వర్గాలు తెలిపాయి. మోడెర్నా అనేది మెసెంజర్ ఆర్‌ఎన్‌ఎ (ఎంఆర్‌ఎన్‌ఎ)వ్యాక్సిన్. ఇది కరోనాపై 90 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది.
భారత్‌లో కరోనా వైరస్ చికిత్స కోసం అత్యవసర అనుమతి పొందిన నాలుగో వ్యాక్సిన్ ఇది. ఇప్పటికే కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ విలకు డిసిజిఐ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే

Moderna vaccine likely to get DCGI’s nod soon

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News