Tuesday, April 30, 2024

డిస్కంలపై కేంద్రం భారం

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఎనర్జీసెస్ పేరుతో బాదుడు
పెరిగిన బొగ్గు ధరలు
రైల్ రవాణాపై 40 శాతం పెంపు
రెన్యుబుల్ ఎనర్జీ పేరుతో అదనపు భారం
సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, కృష్ణపట్నం పిపిఏలతో కుదేలు
రాష్ట్రం ఏర్పడే నాటికే 12,185 కోట్ల నష్టాలతో డిస్కంలు
అదనపు భారంగా పరిణమించిన కేంద్రం నిర్ణయాలు
లోటును పూడ్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

Modi govt looting telangana power
మనతెలంగాణ/హైదరాబాద్:  కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దేశంలోనే 24 గంటల పాటు నిరంతర విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణ నెంబర్‌వన్‌గా నిలిచినా కేంద్రం ప్రతిసారీ సృష్టించే సమస్యలతో రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.12,185 కోట్ల నష్టాలతో డిస్కంలకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వాటిని లాభాల బాటలో పయనింప చేయడానికి రాష్ట్రం అనేక ప్రణాళికలను రూపొందించింది. పేదలకు మేలు చేసే సబ్సిడీలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోంది. ఇవన్నీ ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం డిస్కంలపై మరింత భారం మోపేలా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

టన్నుకు 50 నుంచి రూ.400లకు పెంపు

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల విద్యుత్ సరఫరా అందించిన రాష్ట్రం గా సంచలనం సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సంస్కరణల పేరుతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే నూతన సంస్కరణలు విద్యుత్ సంస్థలకు భారంగా మారాయి. గ్రీన్ ఎనర్జీ పేరుతో టన్నుకు 50 రూపాయలు ఉండే క్లిన్ ఎనర్జీ సెస్‌ను ఒక్కసారిగా రూ.400కు పెంచడంతో గడిచిన ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.7,200 కోట్ల అదనపు భారం పడింది. రాష్ట్ర డిస్కంలు థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 50 వేల మిలియన్ యూనిట్లను ప్రతి సంవత్సరం కొనుగోలు చేస్తోంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం బొగ్గు ధరలను సాలీనా ఆరు నుంచి పది శాతం మేర పెంచడంతో అదనంగా ప్రతి సంవత్సరం రూ.725 కోట్ల భారం రాష్ట్ర డిస్కంలపై పడింది. దీనికి తోడు బొగ్గు రవాణా ఖర్చులు కుడా తడిసి మోపెడవుతున్నాయి. గడిచిన నాలుగు ఏళ్లలో బొగ్గు రవాణా రైల్వే చార్జీలు 40 శాతం మేర పెంచడంతో వాటిని ఏ రకంగా పూడ్చుకోవాలో తెలియక డిస్కంలు నష్టాల బాటలో పయనిస్తున్నాయి.

పిపిఏల ఏకపక్ష రద్దుతో….

రెన్యుబుల్ పవర్ పర్చేజ్ ఆబ్లిగేషన్ పాలసీని తప్పనిసరి చేయడంతో రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల పిఎల్ ఎఫ్‌లపై భారీగా ప్రభావం చూపింది. అంతకు ముందే రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల పిపిఏలను ఏకపక్షంగా రద్దు చేయడంతో రాష్ట్ర విద్యుత్ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడింది. డిస్కంలు ఈ లోటును పుడ్చడం కోసం బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడంతో సంస్థలపై రూ.2763 కోట్ల అదనపు భారం మోయాల్సి వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇతర ఎపి జెన్‌కో ఉత్పత్తి సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్‌ను నిలిపి వేయడంతో తెలంగాణ సంస్థలు రూ.2502 కోట్లు అదనంగా భరించాల్సి వస్తోంది. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడకుండా అన్ని వర్గాల వినియోగదారులకు సబ్సిడీతో పాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది.

ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు లబ్ధి

అందులో ప్రధానంగా ఒక్కో వ్యవసాయ పంపుసెట్ కు ప్రతి సంవత్సరం 18,167 రూపాయల సబ్సిడీ ఇస్తూ నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ ను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 19.03 లక్షల వ్యవసాయ మోటార్ల కనెక్షన్లు ఉండగా గడిచిన ఏడు సంవత్సరాల్లో 6.89 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అదనంగా మంజూరు చేయడంతో మొత్తం వ్యవసాయపు కనెక్షన్ల మీదనే ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం రూ.3,375 కోట్లు ఖర్చు చేసింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు 3,200 కోట్లు ఖర్చు చేస్తుంది. అదే విధంగా 200 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించే గృహ వినియోగదారులకు సబ్సిడీ రూపంలో ప్రతి సంవత్సరం రూ.1,253 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రత్యేకించి 101 యూనిట్ల లోపు విద్యుత్ ను వినియోగించే ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు పూర్తి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తోంది. ఈ పథకం ద్వారా 5,77,100 లక్షల ఎస్సీ వినియోగదారులు, 2,69,983 ఎస్టీ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు.

నాయీ బ్రాహ్మణులు, లాండ్రీ షాపులకు ఉచిత విద్యుత్

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులు నిర్వహించే 15,046 వేల హెయిర్ సెలూన్‌లకు 250 యూనిట్ల మేర నెల ఒక్కంటికి ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. అదే విదంగా 50 దోబీఘాట్లకు,47,545 లాండ్రీ షాపులకు నెలకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తు న్నారు. వీటికి తోడు 4,920 పవర్‌లూమ్ వినియోగదారులకు, 5920 కోళ్ల ఫారాలకు 36 స్పిన్నింగ్ మిల్స్‌కు యూనిట్ ఒక్కంటికి రెండు రూపాయల సబ్సిడీని ప్రభుత్వం అందిస్తోంది. గడిచిన ఐదేళ్లుగా విద్యుత్ చార్జీలను పెంచకుండా నెట్టుకొస్తున్న క్రమంలో కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్నింటికీ మించి కోవిడ్ ప్రభావంతో 4,374 కోట్ల రూపాయల కలెక్షన్ నిలిచిపోవడం కుడా డిస్కంలపై ఆర్థిక భారం అదనంగా పడిందని విద్యుత్ రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల ఆధ్వర్యంలో డిస్కంలను మళ్లీ లాభాల బాటలోకి పయనింప చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News