Thursday, May 2, 2024

రాజ్యాంగానికి తూట్లు

- Advertisement -
- Advertisement -

రాజ్యాంగ సంస్థలను స్వప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నది ప్రత్యర్థులపై పగ తీర్చుకోవడానికి వాడుతున్నది
కలిసి కేంద్ర పాలకుల దుర్నీతిపై పోరాడాలి రాజ్యాంగంపై ఎవరికీ అగౌరవం లేదు కొన్ని పార్టీలకు మాత్రం నినాదం.. మాకు
విధానం అంబేద్కర్ తత్వాన్ని ఆకళింపు చేసుకొని సిఎం కెసిఆర్ ముందుకు సాగుతున్నారు. ఆయన కలలను సాకారం
చేయడానికే దళితబంధుకు శ్రీకారం చుట్టారు.
2లక్షల మందికి ఈ పథకం వర్తింపజేస్తారు:
అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా
సిరిసిల్ల అంబేద్కర్ కూడలిలో ప్రసంగించిన
మంత్రి కెటిఆర్

అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేంద్రం తుంగలో తొక్కుతున్నది

మన తెలంగాణ/తంగళ్లపల్లి (సిరిసిల్ల):  భారతరత్న బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా పో రాడాల్సిన అవసరం అందరిపై ఉందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పి లుపునిచ్చారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను తమ అధీనంలో పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులపై పగతీర్చుకునేలా వ్యవహరిస్తున్న వారిపై కలసికట్టుగా పోరాడాల ని, ఇందుకోసం ప్రజలందరూ న్యాయం, ధర్మం వైపు నిలబడాలన్నారు. అంబేడ్కర్ 131వ జయంతి సందర్భంగా గురువారం జిల్లా కేంద్రమైన సిరిసిల్లా అంబేడ్కర్ కూడలిలో ఆయన విగ్రహానికి పూ లమాలవేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడుతూ..

అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ఎవరికీ అగౌరవం లేదని, రాజ్యాంగం ఏ ఒక్క వర్గానిదో కాదన్నారు. దళిత, అణగారిన పేదవర్గాల అభ్యున్నతికి కృషిచేసిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు. కొన్ని పార్టీలకు అంబేడ్కర్ ఒక నినాదం ఐతే మాకు అంబేడ్కర్ ఒక విధానమన్నారు. అంబేడ్కర్‌తత్వాన్ని మాటల్లో చెప్పేవారే ఎక్కువని.. కానీ, ఆయన చెప్పిన తత్వాన్ని సిఎం కెసిఆర్ ఆకలింపు చేసుకొని ముందుకు సాగుతున్నారన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంవల్లే తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకా రం చేసుకున్నామన్నారు.

సిఎం కెసిఆర్ అంబేద్కర్ కలలను సాకారం చేసేందుకు దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రస్తుత బడ్జెల్‌లో దళితబంధు కోసం రూ.17,800వేల కోట్లు కేటాయించామన్నారు. 2 లక్షల మంది లబ్ధిదారులకు ఈ పథకాన్ని వర్తిం పజేయనున్నట్లు తెలిపారు. ఒక్క పథకానికి ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఇన్ని వేల కోట్లు కేటాయించిన పిఎం, సిఎం దేశంలో ఎప్పుడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. దళితబంధు పథకాన్ని ప్రభుత్వ పథకంగా కాకుండా ఉద్యమంలా భావించి సిఎం కెసిఆర్ అమలు చేస్తున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News