Monday, April 29, 2024

కొనుగోళ్లు షురూ

- Advertisement -
- Advertisement -

అంబేద్కర్ జయంతి
కలిసి
గురువారం నాడే
కొనుగోలు కేంద్రాలు
ప్రారంభం నిజామాబాద్
జిల్లా వేల్పూరులో మంత్రి
ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో
ప్రారంభమైన ధాన్య
సేకరణ ఖమ్మం జిల్లా
మంచుకొండలో
ప్రారంభించిన మంత్రి
పువ్వాడ అజయ్ కుమార్

రాష్ట్రంలో కొన్నిచోట్ల గురువారమే మొదలైన ధాన్యం సేకరణ

మన తెలంగాణ/హైదరాబాద్:  యాసంగి ధాన్యం సంక్షోభంలో ఇరుక్కుపొకుండా రాష్ట్ర రైతులను కాపాడేందు కు టిఆర్‌ఎస్ సర్కారు వాయువేగంతో స్పందించింది. ధాన్య కొనుగోలుకు అవసరమైన ప్రణాళికలు సిద్దిం చేసింది. శుక్రవారం రాష్ట్రంలో రైతుల నుంచి ధా న్యం కొనుగోలు చేసేందుకు సర్వం సి ద్ధం చేసింది. అయితే అంబేద్కర్ జయం తి కలిసి రావడంతో ఇదే మంచి శుభసూచకం అని భావించి రాష్ట్రం లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించా రు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వే ముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూరులో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ధాన్యం సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఖ మ్మం జిల్లా మంచుకొండలో రవాణాశా ఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆయా జిల్లాల్లో వరికోతలను బ ట్టి రైతులు ధాన్యం విక్రయించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ధాన్యం విక్రయాలకు వచ్చే పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ధాన్యం సేకరణ కేంద్రాలు ప్రారంభించాలని ప్రభు త్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. మే నెల 10నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో 100శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. రైతుల నుంచి ధాన్యం కొ నుగోలు చేసిన 24గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమే చేసేలా ముఖ్యమంత్రి  కెసిఆర్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో యా సంగి కింద 36లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు 65లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు లభించనున్నాయి. రాష్ట్రంలో స్థానిక అవసరాలకోసం 10లక్షల మెట్రిక్ టన్నులు, రాష్ట్ర పరిధిలోనే ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా బియ్యం పంపిణీకి మ రో 10లక్షల మెట్రిక్ టన్నులు అవసర పడతాయని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. మిగిలిన వాటిలో సుమారు 45లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ముడిబియ్యంగా మార్చి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌సిఐకి అందజేయనున్నారు.
రూ.15వేలకోట్లు బ్యాంకు రుణం
రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రూ.15వేల కోట్ల రూపాయలు అవసరం అని పౌరసరఫరాల శాఖ అధికారులు ప్రాధమికంగా అంచనా వేశారు. నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేసిన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ నివేదికకు ఆమోద ముద్రవేశారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన నిధులను పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల ద్వారా రుణంగా సమకూర్చుకునేందుకు ఈ సంస్థ తరపున హామీగా ప్రభుత్వం బ్యాంకులకు కౌంటర్ గ్యారెంటీ ఇచ్చింది . నిధుల లభ్యత కూడా పుష్కలంగా అందుబాటులోకి రావటంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిమగ్నమవుతున్నారు. ప్రతికింటాలు ధా న్యం కొనుగోలుకు కనీస మద్దతు ధర కింద ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 1640 చెల్లించే విధంగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. మిల్లర్లు ఎక్కడైనా నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి కనీస మద్దతు ధరకంటే తక్కువ చెల్లిస్తే ఆ మిల్లరుపైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే రైస్‌మిల్లును సీజ్ చేస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి రైస్ మిల్లర్లను హెచ్చరించారు.
రాష్ట్ర సరిహద్దు చెక్‌పోష్టుల్లో గట్టి నిఘా
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట సరహద్దుల్లో 51చోట్ల తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో పండించిన ధాన్యం తెలంగాణలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రాకుండా అడ్డుకట్ట వేసేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేసింది. గురువారం నాడు ఎపినుంచి ట్రాక్టర్లలో ధాన్యం బస్తాల లోడ్‌తో తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న వాహనాలను అధికారులు గుర్తించి సరిహద్దు చెక్‌పోష్టు వద్దనే అడ్డుకున్నారు. గట్టిగా వార్నింగ్ ఇచ్చి వాహనాలను వెనక్కు పంపారు. పొరుగు రాష్ట్రాలనుంచి గింజ కూడా రాష్ట్రంలోకి రాకుండా పట్టిషమైన భద్రతను ఏర్పాటు చేసినట్టు పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు.
మిల్లింగ్‌లో తరుగుల అధ్యయనం కోసం కమిటి
రాష్ట్రంలో యాసంగి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం మిల్లింగ్‌లో నూక నష్టాలపై సమగ్ర అధ్యయం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు కమిటీని ఏర్పాటు చేస్తోంది. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు చేర్చా క అక్కడ మిల్లింగ్‌లో క్లింటాలు ధాన్యానికి ఎన్ని కిలోల బియ్యం లభిస్తుందో, నూకశాతం ఎంతో, తౌడు, పొట్టు ఎంత శాతం వస్తుందో ఈ కమిటి సూక్ష్మస్థాయిలో పరిశీలన చేయనుంది. దాన్ని బట్టే మిల్లింగ్‌లో తరుగు నష్టాలు, రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నూక నష్టాలు ఎంత అన్నది స్సష్టత రానుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News