Wednesday, May 15, 2024

ఆ విద్యుత్ ను తెలంగాణకే ఎక్కువ కేటాయిస్తా: మోడీ

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఎన్‌టిపిసి ప్లాంట్ శంకుస్థాపన చేసిందీ, ప్రారంభించింది తానేనని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. బిజెపి ఇందూరు ప్రజాగర్జన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. మహిళలు పెద్ద సంఖ్యలో రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని, కొన్ని రోజుల క్రితమే మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకున్నామన్నారు. భవిష్యత్‌లో మరింత మహిళా శక్తిని మనం చూడనున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో అత్యాధునిక సూపర్ పవర్ థర్మల్ విద్యుత్ కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. ఎన్‌టిపిసితో తెలంగాణలో నాలుగు వేల మెగావాట్లు విద్యుత్ అందుబాటులోకి వస్తుందని మోడీ వెల్లడించారు. ఎన్‌టిపిసి సూపర్ పవర్ ప్లాంటుతో తెలంగాణలో ఎంతో మార్పు రానుందని వివరించారు. పెద్దపల్లి ఎన్‌టిపిసి విద్యుత్ ప్లాంట్‌ను శరవేగంగా నిర్మించుకున్నామని, ఎన్‌టిపిసి ప్లాంట్ నుంచి తయారయ్యే విద్యుత్‌లో ఎక్కువ భాగం తెలంగాణకే కేటాయిస్తామని మోడీ హామీ ఇచ్చారు.

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News