Tuesday, May 21, 2024

రేపు వారణాసికి ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

Modi to inaugurate Kashi Vishwanath Corridor tomorrow

కాశీవిశ్వనాథ్ కారిడార్ ఫేజ్1ను ప్రారంభించనున్న ప్రధాని
ఘాట్ వద్ద పనుల్లో కార్మికులు బిజీబిజీ

వారణాసి: ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సోమవారం ఈ ప్రాజెక్ట్ ఫేజ్1ను ప్రధాని ప్రారంభించనున్నారు. దాంతో, ఆ ప్రాంతంలో ఆదివారం కూడా కార్మికులు పలు నిర్మాణాల్ని పూర్తి చేయడంలో నిమగ్నమయ్యారు. దివ్యకాశి, భవ్యకాశి పేరుతో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రానున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఫేజ్1 పనుల కోసం రూ.339 కోట్లు కేటాయించారు. కాశీ విశ్వనాథుని ఆలయం నుంచి గంగానది ఘాట్లకు కలిపే రహదారి పనులతోపాటు పలు నిర్మాణాల్ని ఈ ప్రాజెక్ట్ కింద చేపట్టారు. పనులు పూర్తి కావడానికి కనీసం మరో నాలుగు నెలలు పడుతుందని ఘాట్ దగ్గర పని చేస్తున్న కార్మికుడొకరు తెలిపారు.

వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోడీ ఇటీవల ఆ రాష్ట్రంలో వరుస పర్యటనలు జరుపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలుబడకముందే పూర్తయిన ప్రాజెక్టుల్ని చకచకా ప్రారంభించాలని బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. తమ హయాంలో ఈ పనులు పూర్తి చేశామంటూ ప్రచారాస్త్రంగా వాడుకోవాలన్నది బిజెపి వ్యూహం. యుపిలో గత ప్రభుత్వ(అఖిలేశ్ నేతృత్వంలోని ఎస్‌పి ప్రభుత్వం) హయాంలో పనులేమీ జరగలేదంటూ ప్రధాని ఇప్పటికే విమర్శనాస్త్రాలు సంధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News