Sunday, May 12, 2024

ప్రైవేటు బడుల్లో జాడలేని కరోనా నిబంధనలు

- Advertisement -
- Advertisement -

Private schools that do not comply with corona regulations

ఫీజుల ఆరాటం తప్ప చిన్నారులపై శ్రద్ద చూపని యాజమాన్యాలు
ప్రధాన ద్వారం వద్ద శానిటైజర్, మాస్కులు కనిపించిన పరిస్దితులు
ఒకే తరగతి గదిలో గుంపులుగా కూర్చుంటున్న విద్యార్థులు
వైరస్ ఉనికితో భయాందోళన వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

హైదరాబాద్ : నగరంలో కరోనా వైరస్ ఉనికి చాటుతుండటంతో వైద్యశాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలని పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యాసంస్దలు మాత్రం తమకే పటినట్లుగా వ్యవహరిస్తూ ఫీజులు దండుకోవడమే పనిగా ఉన్నట్లు విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. స్కూళ్లలో కరోనా నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ చిన్నారుల ఆరోగ్య పట్ల నిర్లక్షం చేస్తున్నారని పేర్కొంటున్నారు. గత వారం రోజుల నుంచి మహమ్మారి విస్తరించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రారంభించి రెండు నెల పాటు కరోనా నిబంధనలు పాటించి తరువాత తాజాగా ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయాల్సిన శానిటైజర్, మాస్కులు అందుబాటులో ఉంచడంలేదంటున్నారు. గత పదిరోజుల జీహెచ్‌ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు 72నుంచి 82వరకు నమోదైతున్నాయి. భవిష్యత్తులో వైరస్ ప్రభావం చాటే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విద్యాసంస్దలు మాత్రం జేబులు నింపుకునే వేటలో పడ్డారని విద్యార్దిసంఘాలు విమర్శలు చేస్తున్నారు.

చలి తీవ్రతో సీజనల్ వ్యాధులు విస్తరిస్తుండగా, మరో వైపు కరోనా పాజిటివ్ కేసులు బయటపడుతుండటంతో పరిస్దితులు భయానకంగా ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం విద్యార్దుల సంఖ్య పెరగడంతో ఒక బెంచీల్లో ముగ్గురి కంటే ఎక్కువ విద్యార్దులను కూర్చోబెట్టి, బౌతికదూరం ఉండేలా చూడటంలేదని చెబుతున్నారు. కొందరు విద్యార్ధులు మాస్కులు సక్రమంగా ధరించకుంటే పెట్టుకోవాలని కూడా సూచనలు చేయడం లేదని, ప్రతి విద్యార్దిని ఈవిద్యాసంవత్సరానికి చెందిన ఫీజులు చెల్లించారని అడుగుతూ వేధింపులు చేయడం తప్ప వైరస్ పట్ల నిర్లక్షం వహిస్తున్నారని మండి పడుతున్నారు. మధ్యాహ్నం బోజనం కూడా ఒకే దగ్గర గుంపులుగా ఉండి చేయాల్సి వస్తుందని, అందులో జలుబు, దగ్గు లక్షణాలున్నవారినికూడా గుర్తించడంలేదంటున్నారు.

సాయంత్రం స్కూళ్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు మెట్లపై ఒకేసారి గుంపులు వస్తున్నట్లు, క్యూ పద్దతిలో వచ్చే విధంగా చూడటం లేదని చెబుతున్నారు. హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలుండగా వాటిలో 1.10 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఈస్కూళ్లలో 90 శాతం మంది విద్యార్దులు తరగతులకు హాజరై కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. అదే విధంగా ప్రైవేటు స్కూళ్లు 1875 ఉండగా వాటిలో 7.39లక్షల మంది విద్యార్దులుండగా అక్కడ భిన్నంగా ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు కోవిడ్ నిబంధనలు పాటించని పాఠశాలలను తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News