Monday, May 13, 2024

త్వరలో నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌ను ప్రారంభించనున్న మోడీ

- Advertisement -
- Advertisement -

Modi will soon launch the National Intelligence Grid

న్యూఢిల్లీ : ఉగ్రవాద నిర్మూలనకు ఉపయోగపడే సమాచారాన్ని అందించే అత్యంత ఆధునిక సాంకేతిక సామర్ధంతో రూపొందిన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లేదా ఎన్‌ఎటి.జిఆర్‌ఐడిని త్వరలో ప్రధాని మోడీ ప్రారంభిస్తారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. 2008లో ముంబైలో ఉగ్రదాడుల తరువాత బయటపడిన భద్రతా వ్యవస్థ లోని వైఫల్యాలను గమనించి అత్యంత ఆధునిక సాంకేతిక సామర్థం కలిగిన నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌ను రూపొందించారు. ఉగ్రవాదులు, ఆర్తిక నేరస్తులు, తదితర విద్రోహ సంఘటనలకు పాల్పడిన వారి పూర్తి సమాచారం తెలుసుకోడానికి ఉపయోగపడేలా ఈ నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్‌ను రూపొందించడమైందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఈనెల 4 న వెల్లడించారు. బ్యూరో ఆప్ పోలీస్ రీసెర్చి అండ్ డెవలప్‌మెంట్ (బిపిఆర్‌డి) 51 వ సంస్థాపక దినోత్సవ కార్యక్రమంలో అమిత్ షా నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ లక్షాలను వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News