Sunday, May 5, 2024

శ్రీ సిటీలో మాండెలెజ్ ఇండియా భారీ పెట్టుబడులు..

- Advertisement -
- Advertisement -

క్యాడ్‌బరీ డైరీ మిల్క్, ఓరియో, బోర్న్‌విటా వంటి బ్రాండ్‌ల పోర్ట్‌ఫోలియో కలిగిన మాండెలెజ్ ఇండియా, నేడు , ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో తమ తయారీ కర్మాగారం విస్తరణ కోసం ఈరోజు వర్చువల్ గ్రౌండ్‌బ్రేకింగ్ (శంఖుస్థాపన) వేడుకను నిర్వహించింది. భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త చాక్లెట్ సామర్థ్యాన్ని రూపొందించడానికి కంపెనీ INR 1600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కార్య క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాండెలెజ్ ఇండియా సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ వేనేపల్లి వర్చువల్‌గా పాల్గొన్నారు.

ఈ పెట్టుబడి తదుపరి మూడు సంవత్సరాలలో అదనపు చాక్లెట్ తయారీ సామర్థ్యాన్ని జోడిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా మాండెలెజ్ ఇంటర్నేషనల్ యొక్క అతిపెద్ద చాక్లెట్ ఉత్పత్తి ప్లాంట్‌లలో ఒకటిగా నిలువటానికి శ్రీ సిటీకి సహాయం చేస్తుంది. ఈ పెట్టుబడి రాష్ట్రంలో అదనపు ఉపాధిని కూడా సృష్టిస్తుంది.

మాండెలెజ్ ఇండియాలోని సప్లై చైన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ వేనేపల్లి గారు మాట్లాడుతూ.”భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగిన సంస్థగా మా వృద్ధికి అనుగుణంగా దేశంలో పెట్టుబడులు పెట్టడం కొనసాగించటం పట్ల సంతోషంగా వున్నాము. మా శ్రీ సిటీ తయారీ కర్మాగారం ఒక కీలకమైన సైట్‌గా ఉంది. మా సామర్థ్యం, ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలను విస్తరించడానికి పెట్టుబడులు పెట్టడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశంలో మా వ్యాపారం యొక్క మొత్తం వృద్ధికి శ్రీ సిటీ దోహదపడటమే కాకుండా స్థిరత్వం, కొత్త ఆవిష్కరణలు, వైవిధ్యం, చేరిక వంటి రంగాలలో మోడల్ సైట్ కూడా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరం అందిస్తున్న సహకారానికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో మా విజయాన్ని కొనసాగించటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము…” అని అన్నారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క నాల్గవ అడ్వాన్స్‌డ్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ (4IR) ‘డిజిటల్ లైట్‌హౌస్ అవార్డు’ గ్రహీతగా శ్రీ సిటీ సదుపాయం ఉండటంతో, ఈ కొత్త పెట్టుబడి పర్యావరణ అనుకూల అభ్యాసాలు మరియు ప్రక్రియలపై దాని దృష్టిని పెంచడానికి సదుపాయాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News