Saturday, April 27, 2024

రౌడీల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలి

- Advertisement -
- Advertisement -

ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి
కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలి
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహించాలి
పోలీస్ కమిషనర్ శ్వేత

మన తెలంగాణ/సిద్దిపేట క్రైమ్ : క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయాలని సీపీ శ్వేత అన్నారు. శుక్రవారం పెండింగ్ కేసులపై ఫంక్షనల్ వర్టికల్‌పై గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్‌ల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిపి ఆన్‌లైన్ క్రైమ్ రివ్యూ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించి యుఐ కేసుల టార్గెట్ రీచ్ కావాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఫోక్సో, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసులలో కోర్టులో ట్రయల్ సమయంలో సాక్షులను మోటివేట్ చేసి కోర్టులో ట్రయల్ ఏ విధంగా నడుస్తుందో ప్రతిరోజు మానిటర్ చేయాలని ఏసీపీలకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న సీసీ సెంటర్ల గురించి తరుచుగా మెజిస్ట్రేట్‌లను కోర్టు అధికారులను కలిసి ప్రతిరోజు మానిటర్ చేసి సీసీ నెంబర్‌లు తీసుకోవాలని సూచించారు. ప్రతి రోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ పెట్టి కేసులు నమోదు చేయాలన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కాంటాక్ట్, నాన్ కాంట్రాక్ట్ కేసులు నమోదు చేయాలని తెలిపారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రతి రోజు నిర్వహించాలన్నారు. ఈ ఛలాన్ పెండింగ్ ఉన్న వాహనాలను గుర్తించి జరిమానా డబ్బులు వెంటనే కట్టించాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి వెంటనే కేసు నమోదు చేసి ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను అరెస్టు చేయాలన్నారు. 2019,20 సంవత్సరంలో పెండింగ్ ఉన్న గ్రేవ్ కేసులలో త్వరగా పరిశోధన పూర్త చేసి చార్జిషీట్ దాఖలు చేయాలని క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. నేరాలు జరిగే ప్రదేశాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు హాట్ స్పాట్‌గా గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలన్నారు. రౌడీలు, కేసీలు సస్పెక్ట్, లాండ్ మాఫియా, సంఘ విద్రోహ శక్తులపై నిరంతరం నిఘా ఉంచి వారి కదలికలను గమనించాని తెలిపారు. గంజాయి గుట్కా అక్రమ రవాణా జరగకుండా విక్రయించకుండా పూర్తిగా నిఘా ఏర్పాటు చేయాలన్నారు. బ్లూ కోల్డ్ పెట్రోల్ కార్స్ అధికారులు సిబ్బంది డయల్ 100 కాల్ రాగానే 5 నుంచి 10 నిమిషాలలో సంఘటనా స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని తెలిపారు.

సైబర్ నేరాల నియంత్రణ గురించి గ్రామాలలో పట్టణాలలో గ్రామాల విపిఓలు పోలీస్ అధికారులు సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సీసీ కెమెరాలను ప్రతి రోజు మానిటర్ చేయాలని పని చేయ్యని సీసీ కెమెరాలను వెంటనే బాగు చేయాలని సూచించారు.

* ఫంక్షనల్ ఆర్టికల్ *

ప్రతి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ ద్వారా వచ్చే దరఖాస్తు ఎంక్వయిరీ చేసి పిటీషన్ మాడ్యూల్ నందు అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతి రోజు పెండింగ్ పిటీషన్స్ గురించి మానిటర్ చేయాలని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్‌కు సూచించారు. బ్లూ కోల్డ్, పెట్రోల్ కారు అధికారులు సిబ్బంది డయల్ 100 కాల్స్ రాగానే ఎలాంటి సమయం వృథా చేయకుండా త్వరగా సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. ప్రతి కేసులో ఇంటరాగేషన్ రిపోర్ట్ రాసి ఆన్‌లైన్ పొందుపరచాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల కేసులలో జీపీఎస్ మ్యాప్, ఫాం 54 పూర్తి చేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్, గజ్వేల్ ఎసీపీ రమేశ్, హుస్నాబాద్ ఎసీపీ సతీష్, హుస్నాబాద్ సీఐ రఘుపతిరెడ్డి, గజ్వేల్ సీఐ వీరప్రసాద్, తొగుట సీఐ కమలాకర్, సీసీఆర్బి సీఐ శ్రీనివాసులు, ఐటిసెల్ ఎస్‌ఐ శ్రీకాంత్, రెండు డివిజన్‌ల ఎస్‌ఐలు, ఐటికోర్ టీం సిబ్బంది. సీసీఆర్బి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News