Saturday, April 27, 2024

17న ‘జేమ్స్’

- Advertisement -
- Advertisement -

James Movie released on 17th

కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డేకి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ఇటీవల విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎం సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, ఈనెల 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని విజయ్. ఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News