Tuesday, May 21, 2024

మూసేవాలా హత్యకేసు.. మరో నిందితుడు భారత్‌కు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రముఖ పంజాబీ గాయకుడు , కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకేసులో మరో కీలక నిందితుడిని భారత్‌కు తీసుకువచ్చారు. సచిన్ బిష్ణోయ్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ మంగళవారం అజర్‌బైజాన్ నుంచి దేశానికి రప్పించింది. ఈమేరకు ఢిల్లీ పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. గత ఏడాది మే 29 న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి సిద్ధూ మాన్సా జిల్లా లోని తన స్వగ్రామానికి వెళ్తుండగా కొందరు అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతి చెందారు. అతడి హత్య వెనుక గ్యాంగ్‌స్టర్ లారెన్స్‌బిష్ణోయ్ హస్తం ఉన్నట్టు పోలీస్‌లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరు గత ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, మరో ఇద్దరు జైలులో జరిగిన ఘర్షణలో మరణించారు. హత్యతో సంబంధం ఉన్న సచిన్ బిష్ణోయ్‌ని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ భారత్‌కు రప్పించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News