Thursday, May 2, 2024

మొప్లా తిరుగుబాటుకు కమ్యూనిస్టు విప్లవ రంగు

- Advertisement -
- Advertisement -

కేరళ ప్రభుత్వంపై రాంమాధవ్ విమర్శ

కోజికోడ్(కేరళ): కేరళలో 1921లో జరిగిన మొప్లా తిరుగుబాటుగా పేరుపొందిన మప్పిల అల్లర్లు భారతదేశంలో తాలిబాన్ తరహాలో జరిగిన మొదటి ఘర్షణలని, దీన్ని కమ్యూనిస్టు విప్లవంగా చూపెట్టేందుకు కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ జాతీయ కార్యవర్గ సభ్యు రాంమాధవ్ వ్యాఖ్యానించారు. 1921 నాటి తిరుగుబాటులో మరణించిన బాధితుల సంస్మరణార్థం గురువారం నాడిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జాతీయ నాయకత్వానికి వాస్తవ చరిత్ర తెలుసుకాబట్టే అటువంటి తాలిబాని లేదా వేర్పాటువాద శక్తులు సృష్టించిన హింసకు లేదా ప్రజలను విభజించడానికి జరిగిన ప్రయత్నాన్ని గుర్తించడం లేదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి అఫ్ఘనిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకున్న తాలిబాన్ల మీద, వారు సాగించిన, సాగిస్తున్న ఆఘాయిత్యాల మీద ఉందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News