Wednesday, May 8, 2024

అయోధ్యలో 20 వేల ప్యాకెట్ల ‘మహాప్రసాద్’ సిద్ధం

- Advertisement -
- Advertisement -

అయోధ్య : అయోధ్య రామ్ మందిర్‌లో సోమవారం ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యే విఐపిల కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ‘మహాప్రసాద్’ను సిద్ధం చేయించింది. శుద్ధ నెయ్యి, ఐదు రకాల ఎండు పండ్లు, చక్కెర, శనగ పిండితో తయారు చేసిన ‘మహాప్రసాద్’ 20 వేలకు పైగా ప్యాకెట్లను ప్రాణ్ ప్రతిష్ఠ వేడుక అనంతరం అతిథులకు ట్రస్ట్ అందజేయనున్నదని అధికారి ఒకరు తెలియజేశారు. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ మార్గదర్శకత్వంలో గుజరాత్‌కు చెందిన భగ్వా సేన భారతీ గర్వి, సంత్ సేవా సంస్థాన్ ‘మహాప్రసాద్’ను సిద్ధం చేస్తున్నాయి.

‘సంత్‌ల బస, ఆహారం ఏర్పాట్లతో పాటు మహాప్రసాద్‌ను తయారుచేసే బాధ్యతను మాకు అప్పగించారు’ అని సంస్థ జాతీయ అధ్యక్షుడు కమల్ భాయ్ రావల్ తెలిపారు. దాదాపు 200 మంది వ్యక్తుల బృందం 5000 కిలోలకు పైగా ముడి వస్తువులతో ‘మహాప్రసాద్’ను సిద్ధం చేసినట్లు ఆయన తెలియజేశారు. ‘సంస్థ స్వయంగా సిద్ధం చేసిన ముడి వస్తువులతో మహాప్రసాద్‌ను పరిశుభ్రంగా తయారు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం’ అని ఆయన తెలిపారు. సనాతన సంప్రదాయాన్నిదృష్టిలో పెట్టుకుని సిద్ధం చేసిన మహాప్రసాద్ ప్యాకెట్‌లో రెండు లడ్డులు, సరయూ నది నీరు, అక్షతలు, వక్కపొడి పళ్లెం, కలవ ఉంటాయి. ఆ ప్యాకెట్‌ను ఆదివారం సంస్థ ట్రస్ట్‌కు అందజేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News