Friday, April 26, 2024

ధోనీ రికార్డుకు మోర్గాన్ బ్రేక్..

- Advertisement -
- Advertisement -

Morgan Breaks MS Dhoni's Record for Most Sixes

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డుకు బ్రేక్ పడింది. కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా ధోనీ పేరిట ఉన్న రికార్డును ఇంగ్లండ్ సారధి ఇయాన్ మోర్గాన్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు ధోనీ 211 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగాడు. అయితే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మోర్గాన్ ఈ రికార్డును తిరగరాశాడు. మోర్గాన్ 212 సిక్సర్లతో కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. ఐర్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో మోర్గాన్ ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కాగా, ధోనీ 332 మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే మోర్గాన్ మాత్రం కేవలం 163 మ్యాచుల్లోనే ఈ రికార్డును సాధించడం విశేషం.

Morgan Breaks MS Dhoni’s Record for Most Sixes

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News