Saturday, April 27, 2024

అల్లుడూ.. అందుకో ఎకె 47

- Advertisement -
- Advertisement -

Mother-in-law Given gift of AK 47 to his son-in-law

 

పాకిస్థాన్ పెళ్లి పందిట్లో ఓ అత్త నజరానా

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో వేడుకగా పెళ్లి జరుగుతూ ఉండగా పెళ్లి కొడుకుకు కట్నాలు కానుకల తంతు ఆరంభం అయింది. ఈ క్రమంలో షాదీ ముబారక్‌లు అందుకుంటున్న దుల్హాకు ఓ నడి వయస్సు అందాల యువతి ఓ కానుక అందించింది. అదేమిటో కాదు ఏకంగా ఎకె 47. తాను పెళ్లికొడుకుకు ఈ కల్షనికోవ్ రైఫిల్‌ను అపురూప నజరానాగా ఇస్తున్నట్లు తన వంతు కట్నంగా పేర్కొంది. పెళ్లికి వచ్చిన వారి నుంచి వహ్వాలు వహ్వాల కేరింతలు కొట్టించుకుంది. పాకిస్థాన్‌లోని ఏ ప్రాంతంలో ఈ కానుక ఘట్టం జరిగిందనేది తెలియలేదు కానీ ఈ వీడియో ఇప్పుడు సెల్‌ఫోన్లలో క్లిక్ మంటూ కన్పిస్తోంది. ఇక ఈ కానుకను అందించిన యువతి మరెవరో కాదు పెళ్లికొడుకుకు పిల్లనిచ్చిన అత్తనే అని కూడా తేలడంతో ప్రస్తుత ఘట్టం మరింత ఆసక్తికరం అయింది. పెళ్లిళ్లప్పుడు గాలిలో తుపాకులు కాల్పడం కొందరి ఇండ్లల్లో సాంప్రదాయంగా ఉంది. ఇక దక్షణాసియా దేశాలలో క్రీడలలో విజయాలు దక్కించుకున్నప్పుడు కేరింతల మధ్య తూటాలు పేల్చడం జరుగుతూ వస్తోంది. అయితే పెళ్లి పందిట్లో అత్తనే అల్లుడికి ఎకె 47 అపురూప కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని స్పష్టం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News