Friday, May 3, 2024

‘ధరణి’ ప్రజల పాలిటి గుదిబండ: బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు ‘ధరణి’ పోర్టల్ గుదిబండలా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షలు, ఎంపి బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జోన్ అధ్యక్షులు గౌతమ్ రావును ఆయన పరామర్శించారు. ఇటీవల గౌతమ్‌రావు తల్లి మృతి చెందగా.. ఆయనను మాజీ ఎంపి బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్ రావు, తదితరులతో సంజయ్ కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందుకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నల్లా ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిస్తున్నడని ఆరోపించారు. మద్యం ధరలను కూడా భారీగా పెంచి ఏటా రూ.40 వేల కోట్లు దోచుకుంటున్నాడని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News