Tuesday, May 7, 2024

‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి ఎంపిలో పన్ను మినహాయింపు

- Advertisement -
- Advertisement -

భోపాల్: కేరళ స్టోరీ చిత్రానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం పన్ను మినహాయింపు ప్రకటించింది. కేరళ రాష్ట్రంలో ఉగ్రవాదుల కుట్రలను “ది కేరళ స్టోరీ” చిత్రం బయటపెట్టగా, ఆ చిత్రాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఉగ్రవాదులకు మద్దతు పలుకుతోందని ప్రధాని మోడీ కర్ణాటక ఎన్నికల ర్యాలీలో విమర్శించారు. ప్రధాని ఈ విధంగా విమర్శించిన మరునాడే ఈ చిత్రానికి మధ్యప్రదేశ్ పన్ను మినహాయింపు ప్రకటించడం గమనార్హం.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పన్ను మినహాయింపును శనివారం వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో మతమార్పిడులపై ఇప్పటికే చట్టాన్ని తీసుకు వచ్చింది. ఈ చిత్రం కూడా మతమార్పిడులను నివారించడంపై అవగాహన కల్పిస్తోంది. అందుకే అందరూ చూడవలసిన చిత్రం అయినందున దీనికి పన్ను రాయితీ లభిస్తోందని చౌహాన్ వివరించారు. హిందూ యువతులు ఏ విధంగా లవ్ జీహాద్ వెబ్ ఉచ్చులోపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారో ఈ చిత్రం చూపిస్తోందని చౌహాన్ చెప్పారు. ఉగ్రవాద వ్యూహాన్ని కూడా ఈ చిత్రం చూపిస్తోందన్నారు.

Also Read: సిస్టర్ సెంటిమెంట్‌తో…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News