Sunday, May 12, 2024

ఎంఆర్‌ఎఫ్ @ 1,00,000

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : టైర్ల కంపెనీ ఎంఆర్‌ఎఫ్(మద్రాస్ ర బ్బర్ ఫ్యాక్టరీ) షేరు చరిత్ర సృష్టించింది. భారతదేశం చరిత్రలోనే మొదటిసారిగా ఈ కంపెనీ షేరు రూ.1 లక్ష రూపాయల స్థాయి ని తాకింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన 10 స్టాక్‌లలో భారతదేశం నుంచి ఉన్న ఏకైన స్టాక్ ఎంఆర్‌ఎఫ్, తాజాగా లక్ష రూపాయల షేరుగా రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఉదయం మార్కెట్‌లో ఈ కంపెనీ షేరు విలువ రూ. 1,00,200కు చేరింది. ఆ తర్వాత ఆఖరి సమయంలో కొంత తగ్గి రూ.99,900 వద్ద స్థిరపడింది.

మొత్తానికి లక్ష రూపాయల మార్క్‌ను కం పెనీ క్రాస్ చేసింది. పిఇ ప్రకారం ఈ స్టాక్ భారతదేశంలో అత్యంత ఖరీదైన స్టాక్ కానప్పటికీ, ధర పరంగా అత్యంత ఖరీదైన స్టాక్‌గా ఎంఆర్‌ఎ ఫ్ నిలిచింది. అంతకుముందు మే నెలలో మార్కెట్‌లో ఎంఆర్‌ఎఫ్ షేరు రూ. 1 లక్ష మార్కును తాకకుండా కేవలం రూ.66.50 దిగువన ఉంది. అయితే మే 8న ఫ్యూచర్స్ మార్కెట్‌లో ఎంఆర్‌ఎఫ్ స్టాక్ స్థాయి రూ.లక్షను తాకింది.
ఈ కంపెనీని ప్రారంభించింది ఇలా..
1946లో కెఎంఎం మాప్పిళై ఎంఆర్‌ఎఫ్(మద్రాసు రబ్బర్ ఫ్యాక్టరీ)ని స్థాపించాడు. ప్రారంభంలో ఎంఆర్‌ఎఫ్ పేరుతో చిన్న ప్లాంట్‌ని స్థా పించగా, అప్పట్లో ఈ కంపెనీలో పిల్లలు ఆడుకోవడానికి బెలూన్లు తయారు చేశారు. క్రమక్రమం గా ఈ కంపెనీ వృద్ధిని సాధిస్తూ, ఇప్పుడు ఒక్క షేరు విలువ రూ. 1లక్షతో భారతదేశంలో మొద టి స్థానంలో నిలిచింది. అయితే హనీవెల్ ఆటోమేషన్ షేరు రూ.41,152 విలువతో ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. దీని తరువాత పే జ్ ఇండస్ట్రీస్, శ్రీ సిమెంట్, 3ఎం ఇండియా, అ బాట్ ఇండియా, నెస్లే, బాష్ షేర్లు దేశంలో అ త్యంత ఖరీదైన షేర్ల జాబితాలో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News