Tuesday, May 7, 2024

రుణాలివ్వకుంటే ఫిర్యాదు చేయండి: నిర్మలా సీతారామన్

- Advertisement -
- Advertisement -

Nirmala-Sitharaman

చెన్నై: బ్యాంకులు కారణం లేకుండా సూక్ష్మ, చిన్న, మధ్య తరహాపరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఇ)రుణాలను మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ కోరారు. శనివారం చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల గురించి ఆమె వ్యాపారులకు వివరించారు. ఎంఎస్‌ఎంఇలకు బ్యాంకులు కారణం లేకుండా రుణాలు మంజూరు చేయకపోతే తమకు ఫిర్యాదు చేయాలని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకోసం ఫిర్యాదులు స్వీకరించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఆమె చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు సంబంధిత బ్యాంకు మేనేజర్‌కు కూడా ఒక కాపీని పంపించాలని మంత్రి చెప్పారు.

ఎంఎస్‌ఎంఇ లకు పెండింగ్‌లో ఉన్న సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల చెల్లింపులను క్లియర్ చేశామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 60 శాతం మొత్తాన్ని చెల్లించినట్లు చెప్పారు. దేశ ఆర్థిక మూలాలు బాగా ఉన్నందునే విదేశీ మారక నిల్వలు అధికంగా ఉన్నాయని చెప్పారు. గతంలో బ్యాంకులు తమ సంబంధీకులకు ఫోన్‌బ్యాంకింగ్ ద్వారా రుణాలను మంజూరు చేయడం వల్లనే నిరర్థక ఆస్తులు( ఎన్‌పిఎ)లు విపరీతంగా పెరిగిపోయాయని ఆర్థిక మంత్రి తెలిపారు. అలాంటి వాటినన్నిటినీ పరిష్కరించడానికి తమకు నాలుగేళ్ల సమయం పట్టిందన్నారు. గతంలో జరిగిన ఇలాంటి పరిస్థితులను నివారించేందుకు మంచి పాఠాలను నేర్చుకున్నామన్నారు. అనవసరమైన ఖర్చులను ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని.. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడుల ద్వారా ఆస్తులను సృష్టించేందుకు నిర్ణయించామన్నారు.

రాష్ట్రాలకు నిధుల కోత లేదు

రాష్ట్రాలకు నిధులను తగ్గించే యోచన ఏదీ కేంద్రానికి లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇప్పటికే 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాలకు నిధులు ఇచ్చామని, అలాగే 15వ ఆర్థిక సంఘం నివేదికను కూడా సంపూర్ణంగా గౌరవిస్తామని ఆమె చెప్పారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

MSMEs can complain if banks deny loan without reason

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News