Thursday, May 2, 2024

అల్లరి నరేష్ బర్త్‌డేకి ‘నాంది’ ఎఫ్‌ఐఆర్!

- Advertisement -
- Advertisement -

Naandi FIR glimpse release for Allari Naresh Birthday

 

హీరో అల్లరి నరేష్ త్వరలో ‘నాంది’ అనే విలక్షణ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ దగ్గర కో-డైరెక్టర్‌గా పనిచేసిన విజయ్ కనకమేడల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్‌వి2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించి లాక్‌డౌన్ విధించక ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. జూన్ 30 అల్లరి నరేష్ బర్త్‌డే సందర్భంగా ‘నాంది ఎఫ్‌ఐఆర్’ (ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్) పేరిట ఒక చిన్న గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. ‘నాంది’ ఎనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆందోళన నిండిన ముఖంతో జైలులో నగ్నంగా కూర్చొని ఉన్న అల్లరి నరేష్‌ను మనం చూశాం. ఆ పోస్టర్ చూస్తేనే ఇప్పటివరకూ చేయని ఒక అసాధారణ పాత్రను ఆయన చేస్తున్నాడని అర్థమైపోయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News