Sunday, April 28, 2024

నాగచైతన్య ‘దూత’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను రూపొందించారు. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన ‘దూత’ ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటిక్రితం విడుదల చేశారు.

ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో సక్సెస్ ఫుల్ జర్నలిస్ట్ సాగర్ గా చైతన్య నటిస్తున్నారు. పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థ్రిల్లర్ డ్రామా రూపొందించిన ఈ సిరీస్.. ప్రైమ్ వీడియోలో,  ప్రపంచవ్యాప్తంగా 240కి పైగా దేశాలులో డిసెంబర్ 1న ప్రసారం కానుంది.

కాగా, ప్రస్తుతం నాగచైతన్య, యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News