Sunday, April 28, 2024

‘థాంక్యూ’లో చైతన్య కెరీర్‌లోనే ఉత్తమ నటన

- Advertisement -
- Advertisement -

అక్కినేని నాగచైతన్య హీరోగా రాశీఖన్నా, అవికాగోర్, మాళవిక హీరోయిన్లుగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ ‘థ్యాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో దిల్ రాజునిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నాగచైతన్య మాట్లాడుతూ.. “థాంక్యూ సినిమా ఒక అందమైన ప్రేమ కథ. ఈ సినిమాలో విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం. దర్శకుడు విక్రమ్‌తో ఎన్నాళ్లుగానో ఇలాంటి ఒక మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌లోనే ఓ బెస్ట్ మూవీగా నిలుస్తుంది”అని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ “థాంక్యూ మూవీ సినిమా టికెట్ ధరలను తగ్గించలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అందులో నిజం లేదు. కరోనా తర్వాత ‘ఎఫ్ 3’ మూవీ టికెట్ ధరలు తగ్గించాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం టికెట్లు అమ్మాం. ఆ తర్వాత వచ్చిన మేజర్, విక్రమ్ సినిమాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా ఇంకా తగ్గించి అమ్మారు. ఇప్పుడు మేం కూడా థాంక్యూ సినిమాకు అదే ధర నిర్ణయించాం.

మల్టీప్లెక్స్‌లో 200 ప్లస్ జీఎస్టీ, సింగిల్ స్క్రీన్‌లో 150 ప్లస్ జీఎస్టీగా ధర నిర్ణయించాం. ఇక మీదట వచ్చే చిన్న, మీడియం స్థాయి సినిమాలకు ఇంచుమించు ఇదేవిధంగా టికెట్ ధరలు ఉంటాయి. త్వరలోనే నిర్మాతలు అందరం సమావేశమై టికెట్ ధరల విషయంలో ఏకాభిప్రాయానికి వస్తాం. ఇక నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమాలో తన కెరీర్‌లోనే ఉత్తమ నటనను కనబరిచాడు. విక్రమ్ కె.కుమార్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు” అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నాగచైతన్య అద్భుతమైన నటన ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. అతనితో మరిన్ని సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను. మాళవిక తన నటనతో మైమరపిస్తుంది. దిల్‌రాజు వంటి మంచి నిర్మాత సహకారంతో ఈ చిత్రాన్ని అందంగా తెరకెక్కించాము. తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాళవిక, పి.సి.శ్రీరామ్, బివిఎస్ రవి పాల్గొన్నారు.

Naga Chaitanya talks with Media About ‘Thank You’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News