Friday, May 3, 2024

కీలక సన్నివేశాల చిత్రీకరణలో…

- Advertisement -
- Advertisement -

Nagarjuna In filming of key scenes

 

సీనియర్ స్టార్ అక్కినేని నాగార్జున పలు ఆసక్తికర చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగ్ కెరీర్‌లోనే భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇదివరకే కొంతమేర షూట్‌ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌ను తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభించారు. లాంగ్ షెడ్యూల్‌గా ప్లాన్ చేసిన ఇందులో నాగార్జున, గుల్ పనాంగ్, అనిఖ్ సురేంద్రన్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌కి సంబంధించి నాగార్జున స్టైలిష్ ఫోటోను విడుదల చేశారు. నాగ్ యాక్షన్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నారాయణ్ దాస్ కె.నారంగ్, పున్కూర్ రామ్మోహన్‌రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News