Thursday, May 2, 2024

ములుగుకు నానాజి దేశ్‌ముఖ్ సర్వోత్తం అవార్డు

- Advertisement -
- Advertisement -

ములుగు: నానాజి దేశ్ ముఖ్ సర్వోత్తమ్ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం కోసం దేశంలో మూడు జిల్లాలను ఎంపిక చేయగా అందులో ములుగు జిల్లాకు రెండవ స్థానం దక్కిందని మంత్రి పేర్కొన్నారు. దేశంలోని 766 జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీలు, జాతీయ పంచాయతీ అవార్డులో పాల్గొనగా వాటి ప్రదర్శన ఆధారంగా ములుగు జిల్లా జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీల జాబితాలో రెండవ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు.

Read Also: లెజెండరీ స్పిన్నర్‌ పుట్టినరోజు.. ‘800’ ఫస్ట్ లుక్ విడుదల

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా పురస్కారంతో పాటు రూ. 3 కోట్ల నగదు పారితోషికాన్ని జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్, కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి స్థానిక సంస్థలతో కలిసి అందుకోవడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో మొదటి బహుమతి పొందే విధంగా కృషి చేయాలని అధికారులలో మంత్రి స్పూర్తిని నింపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, మిషన్ భగీరథ ఫలితాలతోనే పంచాయతీలకు జాతీయ స్థాయి అవార్డులు వరించాయని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మరోసారి మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు జిల్లా అధికారులను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News