Sunday, April 28, 2024

సూర్యుడిని తాకిన నాసా పార్కర్ ప్రోబ్

- Advertisement -
- Advertisement -

NASA Parker probe touching the sun

ఖగోళ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభం

న్యూఓర్లీన్స్ : ఖగోళ చరిత్రలో అపూర్వమైన కొత్త అధ్యాయం మొదలైంది. ఇంతకాలం అసాధ్యమని భావించిన దాన్ని నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ( నాసా) సుసాధ్యం చేసి చరిత్ర సృష్టించింది. దాదాపు 2 మిలియన్ డిగ్రీల ఫారన్‌హీట్ ఉష్ణోగ్రత ఉండే సూర్యుడి ఉపరితల వాతావరణ వలయం కరోనాను నాసా పంపించిన రోదసీ నౌక పార్కర్ సోలార్ ప్రోబ్ తాకింది. ఇటువంటి విజయం సాధించడం చరిత్రలో తొలిసారి. నాసా చరిత్రలో ఇదో మైలురాయి. అంతేకాకుండా మానవాళికి సౌర శాస్త్ర విజ్ఞానంలో గొప్ప ముందడుగు పడింది. నాసా మంగళవారం రాత్రి ఇచ్చిన ఓ ట్వీట్‌లో మా పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని తాకింది. తొలిసారి సూర్యుడి వాతావరణం కరోనా గుండా ప్రయాణించింది అని తెలియచేసింది. సోలార్ ప్రోబ్ ఏప్రిల్ 28 న సూర్యుని వెలుపలి వాతావరణం లో కరోనాగా పేర్కొనే ఆ వాతావరణంలో పార్కర్ అంతరిక్ష నౌక అక్కడి శాంపిళ్లను సేకరించింది. సూర్యుడి బాహ్య వాతావరణంలో ప్రవేశించింది. అక్కడ పర్యటించి ధూళి కణాలు, అయస్కాంత క్షేత్రాలకు సంబంధించిన కొన్ని నమూనాలను సేకరించి పంపించింది.

హార్వర్డ్ అండ్ స్మిత్ సోనియన్ విశ్వవిద్యాలయం లోని సెంటర్ ఫర్ ఆస్ట్రో ఫిజిక్స్ సహా అనేక మంది శాస్త్రవేత్తలు ఇంజినీర్ల సహకారంతో ఈ విజయం సాధ్యమైంది. ఈ నౌక లోని సోలార్ ప్రోబ్ కప్‌ను వీరు నిర్మించి పర్యవేక్షించారు. సోలార్ ప్రోబ్ కప్ ఈ పరిశోధనలో అత్యంత కీలకమైనది. సూర్యుని వాతావరణం లోని ధూళి కణాలను సేకరించడంలో ఈ కప్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ కప్ సేకరించిన సమాచారం ప్రకారం ఈ రోదసీ నౌక ఏప్రిల్ 28 న కరోనాలో మూడుసార్లు ప్రవేశించింది. కరోనా లోకి ఈ రోదసీ నౌక వెళ్లినట్టు శాస్త్రవేత్తలు రుజువు చేయడానికి దోహద పడింది. నాసా తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రోబ్ విజయవంతం కావడం సాంకేతిక పరిజ్ఞానంలో నవకల్పన మాత్రమే కాదు, ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు సూర్యుడు అంతుచిక్కకుండా మిగిలిపోయాడు. ఈ విజయం వల్ల ఆశలు మళ్లీ చిగురించాయి. సూర్యుడి రహస్యాలు ఇప్పుడు బయటపడతాయి. ఉదాహరణకు సూర్యుడి ఉష్ణోగ్రత 5500 డిగ్రీల ఫారన్ హీట్ కాగా, సూర్యుని బయటి వాతావరణం 2 మిలియన్ డిగ్రీల ఫారన్ హీట్ ఉంటుంది.

దీనికి కారణం ఏమిటో ఇప్పటివరకు తెలియదు. ఇటువంటి అంశాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉందనే ఆశలు కూడా తాజాగా చిగురిస్తున్నాయి. అదే విధంగా భూమిపై పవర్‌గ్రిడ్స్, రేడియో కమ్యూనికేషన్స్ వ్యవస్థలకు అంతరాయం కలిగించే సౌరగాలులు వంటి వాటి గురించి కూడా తెలుసుకునే అవకాశం కలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారర్ ప్రోబ్ మెషీన్ సూర్యుడిని తాకడం ఓ అసాధారణ ఘటన అని మిషన్ డైరెక్టర్ థామస్ జుర్ బుచెన్ తెలిపారు. సూర్యుడి నుంచి వెలువడే సౌరతరంగాలపై పార్కర్ ప్రోబ్ మరింత లోతుగా అధ్యయనం చేయనున్నది. సూర్యుడి ఉపరితలం కరోనాలో భ్రమిస్తున్న పార్కర్ ప్రోబ్ వల్ల మున్ముందు మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని ప్రాజెక్టు సైంటిస్టు నౌరు రౌపీ తెలిపారు. పార్కర్ సోలార్ ప్రోబ్‌ను 2018 లో ప్రయోగించారు. మూడు సంవత్సరాల తరువాత పార్కర్ తన గమ్యస్థానానికి చేరుకున్నట్టు శాస్త్రవేత్తలు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News