Friday, April 26, 2024

అరుణగ్రహ అంతరంగం

- Advertisement -
- Advertisement -

NASA released photos of Mars

 

అత్యద్భుతమైన అంగారక గ్రహ చిత్రాలను విడుదల చేసిన అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా)
1. అంగారకుడిపై దిగిన రోవర్(పర్సెవరెన్స్)
2. రోవర్ పక్కనే రాళ్లతో కనిపిస్తున్న అంగారక భూమి
3. కనువిందు చేస్తున్న చదునైన ప్రదేశం

కేప్ కనెవరాల్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా అరుదైన రికార్డును సృష్టించిన విషయం తెలిసిందే. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను గుర్తించేందుకు ఉద్దేశించిన‘ పర్సెవరెన్స్’ రోవర్ శుక్రవారం తెల్లవారుజామున విజయవంతంగా ల్యాండ్ అయింది. 2020 జులైలో ప్రాంభమైన ఈ సుదీర్ఘ యాత్ర విజయవంతం కావడం శాస్త్రజ్ఞులకు శుభవార్తే. ఈ క్రమంలో శుక్రవారం నాసా ‘పర్సెవరెన్స్’అంగారకుడిపై ల్యాండ్ అయిన 24గంటల్లోపే పంపిన అరుదైన ఫొటోలను విడుదల చేసింది. వీటిలో రోవర్ కేబుల్స్ సాయంతో అంగారక గ్రహంపై ల్యాండ్ అయిన ఫొటో కూడా ఉంది. ల్యాండ్ అయ్యే సమయానికి ఆరు ఇంజన్లున్న రోవర్ తన వేగాన్ని గంటకు 1.7 మైళ్లకు తగ్గించుకుని అరుణ గ్రహంపై ల్యాండ్ అయినట్లు నాసా వెల్లడించింది. రోవర్ అంగారకుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన సమయంలో అక్కడ దుమ్ము రేగడం కూడా ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నట్లు రోవర్ చీఫ్ ఇంజనీర్ ఆదమ్‌స్టెల్జ్నర్ తెలిపారు.‘ రోవర్ తన మొట్టమొదటి హై రెజల్యూషన్ కలర్ ఫొటోను అప్‌లోడ్ చేయగలిగింది.

ఇది జెజెరో క్రేటర్‌లోఅడుగుపెట్టిన చదునైన ప్రదేశాన్ని చూపిస్తుంది. ఇక్కడ బిలియన్ల సంవత్సరాల క్రితం ఒక నది, లోతైన సరస్సు ఉనికిలో ఉన్నాయనే ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక రెండో ఫొటోలో రోవర్ ఆరు చక్రాల్లో ఒకటి కనిపిస్తుంది. దాని పక్కనే అనేక రాళ్లు ఉన్నాయి’ అంటూ నాసా ట్వీట్ చేసింది. ‘ ఈ రాళ్లు అగ్నిపర్వత, లేదా అవక్షేప అవశేషాలను సూచిస్తున్నాయా అనేది తేలాల్సి ఉంది. రోవర్ భూమిమీదికి వచ్చినప్పుడు అది తీసుకు వచ్చే ఈ రాళ్లను పరీక్షించి అవి ఏ కాలానికి చెందినవి,.. ఏ రకానికి చెందినవి అనేది తేలుస్తాం’ అని అన్నారు. ‘పర్సవెరెన్స్’ లాండ్ అయిన రోజే కొన్ని ఫొటోలను పంపింది. కానీ అవి బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయి, అంత క్లారిటీ కూడా లేవు.

కానీ ఇప్పుడు వచ్చిన ఫొటోలు చాలా బాగున్నాయని నాసా వెల్లడించింది. రాబోయే కొద్ది రోజుల్లో మరిన్ని ఫొటోలు, అలాగే రోవర్ ల్యాండ్ అయ్యేటప్పటి ఆడియో రికార్డింగ్ కూడా అందే అవకాశాలున్నాయని కాలిఫోర్నియా రాష్ట్రం పసడేనాలోని నాసా జెట్ ప్రొపల్షన్ లేబరేటరీ తెలిపింది. ఇలాంటి ఫొటోలను తాము ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ష్లైట్ సిస్టమ్ ఇంజనీర్ ఆరోన్ స్టెహురా విలేఖరులతో అన్నారు. ల్యాండ్ అయ్యే సమయంలో రోవర్ కేవలం ఒక్క డిగ్రీ మాత్రమే పక్కకు ఒరిగిందని, పూర్తి ఆరోగ్యంగా ఉందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రోవర్‌లోని సిస్టమ్స్‌లను చెక్ చేయడం జరుగుతోందని, వారం రోజుల తర్వాత రోవర్ ముందుకు కదలడం ప్రారంభమవుతుందని వారు చెప్తున్నారు.

NASA released photos of Mars

NASA released photos of Mars

NASA released photos of Mars

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News