Sunday, May 5, 2024

చంద్రయాత్రకు భారత సంతతి వ్యక్తి

- Advertisement -
- Advertisement -

NASA selected man of Indian descent for lunar mission

 

ఎంపిక చేసిన నాసా

వాషింగ్టన్: మానవ సహిత చంద్రయాన కార్యక్రమానికి భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఎంపిక చేసింది. 2024లో చేపట్టే చంద్రయానానికి ఆర్టెమిస్‌గా నాసా నామకరణం చేసింది. దీని కోసం మొత్తం 18మందిని శిక్షణ కోసం ఎంపిక చేసింది. వీరిలో భారతఅమెరికన్ రాజాజాన్ ఉరుపుత్తూర్‌చారి(43) కూడా ఒకరు. చారి మాసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటి)లో, యుఎస్ నావల్ టెస్ట్ పైలట్ స్కూల్‌లో ఉన్నత విద్యనభ్యసించారు. 2017లో నాసా ఆస్ట్రోనాట్‌గా ఎంపికయ్యారు. ఇప్పుడు నాసా చేపడ్తున్న చంద్రయాత్రకు ఓ ప్రత్యేకత ఉన్నది. ఈ యాత్ర ద్వారా చంద్రునిపై మొదటిసారి ఓ మహిళ అడుగు పెట్టనున్నారు. శిక్షణకు ఎంపికైనవారిలో సగం మంది మహిళలే కావడం మరో విశేషం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News