Tuesday, May 21, 2024

మేరా గాఁవ్ మహాన్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తాల విభాగాల్లో తెలంగాణ పంచాయతీ లు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. నేపథ్యంలో రాష్ట్రపతి చేతులమీదుగా న్యూఢిల్లీలో సోమవారం ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు లు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డుల్లో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవడం మనందరికీ గర్వకారణమని సిఎం పే ర్కొన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయ తీ సతత్ వికాస్ పురస్కారాల్లో తొమ్మిది విభాగా ల్లో అవార్డులను ఎంపిక జరగగా, 8 విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే అవార్డులను సాధించడం విశేషమని సిఎం తెలిపారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడుతూ ‘దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా, అందులో కేవలం 46 గ్రా మాలు మాత్రమే అవార్డులు దక్కించుకున్నాయి. ఇందులో నుంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చినయి. అంటే ప్రకటించిన మొ త్తం జాతీయ అవార్డుల్లో 30శాతం తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకున్నది. ఈ 13 ర్యాంకుల్లోంచి కూడా 4 ఫస్టు ర్యాంకులు తెలంగాణకే రావడం గొప్పవిషయం’ అంటూ సిఎం హర్షం వ్యక్తం చేశారు.
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం జరిగిన పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు- అవార్డుల తరువాయి 12లో
ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ జాతీయ ఉత్తమ అవార్డులను, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకోవడం పట్ల..

రా ష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును., కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, ఆ యా గ్రామాల సర్పంచులు, ఎంపిపిలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, పంచాయితీరాజ్ శాఖ అధికారులను సిఎం కెసిఆర్ అభినందించారు.పల్లె ప్రగతి సహా గ్రామీణాభివృద్ధి దిశగా దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్రామీణాభివృద్ధి కా ర్యాచరణకు ఈ అవార్డులు సాక్ష్యంగా నిలిచాయని సిఎం అ న్నారు. అభివృద్ధిలో తెలంగాణప్రతి అంశంలో నూ అగ్రగామిగా నిలిచి, అత్యధిక అవార్డులు గెలుచుకున్న స్ఫూర్తితో తెలంగాణ ఆదర్శంగా దేశవ్యాప్తంగా పల్లెల అభివృ ద్ధి కోసం తమ కృషి కొనసాగుతుందని సిఎం చేశారు.

l దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు తె లంగాణకు చెందిన 4 గ్రామాలు వివిధ విభాగాల్లో నెంబర్ వన్‌గా నిలిచాయి. అందులో -ఆరోగ్య పంచాయతీ విభాగం లో గౌతంపూర్ (భద్రాద్రి కొత్త గూడెం ), -సమృద్ధిగా మంచినీరు అందుబాటులో ఉ న్న విభాగంలో నెల్లుట్ల (జనగామ), -సా మాజిక భద్రత విభాగంలో కొంగట్‌పల్లి (మహబూబ్ నగర్), -స్నేహ పూర్వక మ హిళా గ్రామాల విభాగంలో అయిపూర్ (సూర్యాపేట), -పేదరిక నిర్మూలన, జీవ నోపాధులు విభాగంలో మందొండి (గ ద్వాల), -సుపరిపాలన గ్రామ పంచాయ తీల విభాగంలో చీమల్‌దారి ( వికారాబా ద్), -క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ విభా గంలో సుల్లాన్‌పూర్ (పెద్దపలి), -స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాల విభాగం లో గంభీర్‌రావుపేట (రాజన్న సిరిసిల్ల) దక్కించుకున్నాయి.
l దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచా యత్ సతత్ వికాస్ పురస్కార్ – 2023లో ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీల అ వార్డు విభాగంలో కరీంనగర్ జిల్లా తి మ్మాపూర్ ఎల్.ఎం.డి, ఉత్తమ జిల్లా పరి షత్ విభాగంలో ములుగు జిల్లా, స్పెషల్ కేటగిరీ అవార్డుల్లో గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామం, కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పు రస్కార్ విభాగంలో రంగారెడ్డి జిల్లా క న్హా గ్రామం, నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటి వ్ సర్టిఫికేట్ల విభాగం గ్రామ ఊర్జా స్వ రాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్‌కు సిద్ది పేట జిల్లా మార్కూక్ మండలంలోని ఎ ర్రవెల్లి అవార్డులు పొందాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News