Sunday, May 12, 2024

24 గంటల్లో 4 వేల కేసులు

- Advertisement -
- Advertisement -

 

దేశంలో కరోనా ఉగ్రరూపం…195 మంది మృతి

ప.బెంగాల్‌లో ఒక్క రోజే 98 మరణాలు
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడుల్లోనూ ఆగని వైరస్ ఉధృతి, ఐటిబిపిలో 45 మందికి, ఆర్మీ ఆసుపత్రిలో 24 మందికి పాజిటివ్, 27.41% రికవరీ రేటు

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. ఈ వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,900 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వైరస్ బారిన పడి 195 మంది ప్రాణాలు కో ల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 46,4 33కు చేరుకోగా, మృతుల సంఖ్య 1,568కు చేరుకుంది. మొత్తం బా ధితుల్లో 12,726 మంది కోలుకోగా,మరో 32,138 మంది చికిత్స పొందుతున్నారు.

అయితే భారత్‌లో కరోనా వైరస్ బయటపడిన తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదు కకావడం ఇదే మొదటిసారి. అయితే కొన్ని రాష్ట్రాలనుంచి గతం లో సమాచారం సకాలంలో అందక పోయేదని, ఇప్పుడు ఆ లోపాన్ని సరి చేశామని మంగళవారం విలేకరుల సంయుక్త సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ చెపారు. ప్రస్తుతానికి భారత్ కరోనా కట్టడి విషయంలో చాలా మెరుగైన పరిస్థితిలో ఉందని రికవరీ రేటు 27.41 శాతంగా ఉండడం సంతోషకరమైన విషయమని ఆయన చెప్పారు. మరో వైపు కేసుల సంఖ్య దినదినం పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

బెంగాల్‌లో ఒక్క రోజే 95 మంది మృతి
కాగా పశ్చిమ బెంగాల్‌లో కరోనా తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కేవలం ఒక్క రోజులోనే కరోనా కారణంగా 98 మంది మృత్యువాతపడ్డారు. కొత్తగా 296 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ కారణంగా మృతుల సంఖ్య 133కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 1298 కేసులు నిరారణ కాగా, 218 మంది కోలుకున్నారు. అయితే కేంద్ర ప్రత్యేక బృందం రాష్ట్రంలో పర్యటించి వెళ్లిన మరునాడే రాష్ట్రంలో మరణాల సంఖ్య లో భారీ పెరుగుదల నమోదు కావడం గమనార్హం. అంతేకాక దేశంలో అత్యధిక మరణాల రేటు ఇక్కడే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో మరణాల రేటు 12.8గా ఉంది.

మహారాష్ట్రలో 1567, తమిళనాడులో 527
కాగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్క రోజే రాష్ట్రంలో 1567 కొత్త కేసులు నమోదయ్యాయంటే వైరస్ తీవ్రత రాష్ట్రంలో ఎంతగా ఉందో అర్థమవుతుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 14,541కి చేరగా, మరణాల సంఖ్య 583కు చేరుకుంది. వీటిలో ఎక్కువ కేసులు ముంబయి మహానగరంలోనే నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక తమిళనాడులోనూ వైరస్ తీవ్రత పెరిగిపోయింది. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 527 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3550కి చేరగా, 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మధ్యప్రదేశ్‌లోను వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 2942 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, 165 మంది మరణించారు.

ఐటిబిపిలో 45 మందికి పాజిటివ్
ఇండో టిబెటన్ సరిహద్దు భద్రతాదళం (ఐటిబిపి) పై కూడా కరోనా పంజా విసింది. మొత్తం 45 మంది ఐటిబిపి సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు. వీరంతా ఇటీవలి వరకు దేశ రాజధాని ఢిల్లీలో విధులు నిర్వహించిన వారే కావడం గమనార్హం. ఢిల్లీలోని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఉద్యోగికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఈ కార్యాలయం ఉన్న శాస్త్రి భవన్‌ను తాత్కాలికంగా సీల్ వే శారు.ఆ ఉద్యోగి ఆఖరుగా గత నెల 24న విధులకు వచ్చినట్లు గుర్తించారు.

ఆర్మీ ఆస్పత్రిలో 24 మందికి
ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి(రిసెర్చ్, రెఫరల్)లో 24 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. వీరిలో సర్వీసులో ఉన్న వారితో పాటుగా రిటైరయిన వారు, కొందరు వారిపై ఆధారపడిన వారు కూడా ఉన్నారు. ఈ కేసులన్నీ కూడా ఆస్పత్రిలోని ఆంకాలజీ వార్డులోనే నమోదు కావడం గమనార్హం. వీరినందరినీ ఢిల్లీ కంటోన్మెంట్‌లో ఉన్న ఆర్మీబేస్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. అయితే ఆస్పత్రిలోని ఆరోగ్య సిబ్బందిలో ఒకరికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కాలేదని మరో అధికారి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News