Sunday, May 5, 2024

నేడు నేవీ డే.. నౌకాదళం ఇక స్త్రీశక్తిమయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారత నౌకాదళం వచ్చే ఏడాది నుంచి అన్ని విభాగాలలోకి మహిళలను ఉద్యోగాలలోకి తీసుకుంటుంది . ఈ విషయాన్ని నౌకాదళాల సిబ్బంది ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్ హరి కుమార్ శనివారం తెలిపారు. నౌకాదళ దినోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందు హరికుమార్ విలేకరులతో మాట్లాడారు. నౌకాదళంలోకి దాదాపుగా 3000 మంది అగ్నివీరుల తొలి బ్యాచ్‌ను తీసుకున్నట్లు, వీరిలో 341 మంది మహిళలు ఉన్నారని వివరించారు.

నౌకాదళంలో ఇక అన్ని విభాగాలకు మహిళలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో దాదాపు 15 క్షేత్రస్థాయి యుద్ధ నౌకల్లోకి 28 మంది మహిళా అధికారులను తీసుకున్నారు. వీటిలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య విమానవాహక యుద్ధ నౌక కూడా ఉంది. అగ్నివీర్‌ల తొలి బ్యాచ్ ఇప్పటికే విధుల్లో చేరిందని, వీరిలో మహిళలు కూడా ఉండటం నావికా దళానికి అత్యంత కీలకమైన పరిణామం అని అడ్మిరల్ తెలిపారు. 16 ఏండ్ల కిందటి నుంచే లేడీ ఆఫీసర్లను తీసుకుంటూ వస్తున్నారు. నేవీలోకి తీసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News