Wednesday, May 8, 2024

సిఎం పదవిని ఆశిస్తున్నా: అజిత్ పవార్

- Advertisement -
- Advertisement -

పుణె: మహారాష్ట్రలో 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందుగానే ముఖ్యమంత్రి పదవిని ఎన్‌సిపి దక్కించుకునే అవకాశం ఉందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సిపి) నాయకుడు, మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అజిత్ పవార్ వెల్లడించారు. ఎన్‌సిపిలో తిరుగుబాటు జరగవచ్చని ఇటీవల ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో అజిత్ పవార్ నుంచి ఈ రకమైన వ్యాఖ్యలు రావడం గమనార్హం. పుణె జిల్లా సహకార బ్యాంకులో శనివారం మీడియా సమావేశంలో పాల్గొన్న అజిత్ పవార్ విలేకరుల అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు వందశాతం ఉందని కుండబద్దలు కొట్టారు. 2004లో మిత్రపక్షమైన కాంగ్రెస్ కన్నా ఎన్‌సిపికి అధిక సీట్లు వచ్చిన సమయంలో తన దివంగత సహచరుడు ఆర్‌ఆర్ పాటిల్ ముఖ్యమంత్రి కావలసి ఉందని ఆయన అన్నారు.

అయితే ఢిల్లీ నుంచి వచ్చిన ఒక సందేశంతో ఎన్‌సిపి ఉపముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవలసి వచ్చిందని ఆయన చెప్పారు.
మహారాష్ట్రలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్‌సిపి పోటీ పడుతుందా అన్న విలేకరుల ప్రశ్నకు అప్పటి దాకా ఎందుకు..ఇప్పుడే ముఖ్యమంత్రి పదవిని తమకు ఇవ్వాలని కోరతామని ఆయన చెప్పారు. అయితే..అది ఎలా సాధ్యమో మాత్రం ఆయన వివరించలేదు.గడచిన 20 ఏళ్లలో ఎన్‌సిపి అనేక సార్లు ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిందని, ముఖ్యమంత్రి పదవిని మీరు కోరుకోవడం లేదా అన్న ప్రశ్నకు వందశౠతం తాను కోరుకుంటున్నానని పవార్ జవాబిచ్చారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్‌సిపి, శివసేన కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా ముఖ్యమంత్రి పదవి శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే చేపట్టారు. ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అప్పట్లోనే కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తాము విన్నామని పవార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News