Thursday, May 2, 2024

‘నీ కన్ను నీలి సముద్రం..’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

- Advertisement -
- Advertisement -

uppena

 

మెగా మేనాల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ మూవీని స్టార్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చి బాబు దర్వకత్వం వహిస్తున్నాడు. వైష్ణవ్ సరసన కృతి శెట్టీ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని చిత్రయూనిట్ విడుదల చేశారు. ‘నీ కన్ను నీలి సముద్రం’ అని సాగే ఈ పాట లిరికల్ వీడియో ట్వీట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో జావేద్ అలి ఆలపించిన ఈ పాటకు రచయిత శ్రీమణి లిరిక్స్ అందించారు. ఈ మెలోడి సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Nee Kannu Neeli Samudram Lyrical Song released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News