Thursday, May 2, 2024

16 ఏళ్ల బాలికపై ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం..

- Advertisement -
- Advertisement -

 

 

ముంబయి: 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ ట్యాక్సీ డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. గత వారం ముంబయికి వచ్చిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బాధితురాలిని.. 23 ఏళ్ల ఓ ట్యాక్సీ డ్రైవర్ యుపి నుండి ముంబయి సిటీ వరకు అనుసరించాడు. అక్కడ ఆమెను కలువడానికి పలుమార్లు ప్రయత్నించిన కుదరలేదు. తర్వాత బాధితురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఆమె ఎవరితోనూ చెప్పలేదు. వారం రోజుల తర్వాత అక్కడికి వచ్చిన బాధితురాలి చెల్లెలుకు విషయం తెలువడంతో నిందితుడిపై పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి ఫోన్ ను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. నిందితుడికి బాధితురాలు ముందే తెలుసనని, యూపిలోని బాధితురాలి ఇంటికి తరచూ వెళ్తుండేవాడని పోలీసులు తెలిపారు.

Taxi Driver Arrested For Allegedly Raping Minor in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News