Saturday, May 4, 2024

పేరు మార్చి నెహ్రూ ప్రతిష్టను దెబ్బతీయలేరు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నెహ్రూ మెమొరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ(ఎన్‌ఎంఎంఎల్) పేరును కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది. దీనికి ఇప్పుడు ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ (పిఎంఎంఎల్) సొసైటీ గా నామకరణం చేశారు. ఈ చర్యపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. బిజెపి ప్రభుత్వానికి వేరే అజెండా ఏదీ లేదని , కేవలం నెహ్రూవాద ఘనతను వారసత్వాన్ని లేకుండా చేయడం, అప్రతిష్టపాలు చేయడమే ఏకైక కార్యక్రమంగా పెట్టుకున్నారని విమర్శించారు. నెహ్రూ వారసత్వంపై వీరు నిరంతర దాడికి దిగుతూ ఉన్నా దీని వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని, నెహ్రూ ఆలోచనలు, ఆశయాలు ఈ ప్రపంచానికి రాబోయే పలు తరాల వరకూ స్ఫూర్తిగా నిలుస్తాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

ఉదాత్తత చెరిపేస్తే చెదిరిపొయ్యేది కాదన్నారు. ఎన్‌ఎంఎంఎల్ ఇప్పుడు పిఎంఎంఎల్ అయిందని, ఈ పేరు మార్పిడితో చివరికి తేటతెల్లం అయింది కేవలం బిజెపి ప్రభుత్వం దురాలోచనలే అని విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలోని తీన్‌మూర్తి మార్గ్‌లో నెహ్రూ మ్యూజియం ఉంది. నెహ్రూకు ఈ భవనానికి తరాల సంబంధం ఉంది. గతంలో బ్రిటిష్ పాలనలో ఈ భవంతిని ఫ్లాగ్‌స్టాఫ్ హౌజ్‌గా పిలిచేవారు. అప్పట్లో ఇక్కడ బ్రిటిష్ సేనల ప్రధానాధికారి నివాసం ఉండే వారు. కమాండర్ ఇన్ చీఫ్ రెసిడెన్స్‌గా పేరొందింది. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఇది అప్పటి ప్రధాని నెహ్రూ నివాసం అయింది. నెహ్రూ మరణానంతరం దీనిని నెహ్రూ పేరిట లైబ్రరీగా, మ్యూజియంగా మార్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News